*సీ.ఎం సహాయ నిధి పేదలకు పెన్నిధి*
విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-
సీఎం సహాయ నిధి పేదలకు పెన్నిదని
ప్రభుత్వ విప్ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు అన్నారు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని *_సీ.ఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు* 63.59.60, 57 వార్డులో_ *గణబాబు చెక్కులను పంపిణీ చేశారు* .
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యం పరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న *గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు* సీ.ఎం రిలీఫ్ ఫండ్ ని సద్వినియోగపరచుకోవాలని తెలియజేశారు .
పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా సీ.ఎం రిలీఫ్ ఫండ్ నిధులు అందిస్తున్నామని గణబాబు అన్నారు .
ఈ నేపథ్యంలో పేదలకు చెందిన
పట్నాల గోవిందు- రూ.71,664/-, 57వార్డ్
సురకత్తుల జ్యోతి- రూ. 25,000/-,
63 వార్డ్.
రామస్వామిఉమాపతి- రూ.74,605/-, 58 వార్డ్.
గీసాల అప్పలరాజు- రూ.55,180/-, 57వార్డ్
బొల్లప్రగడ త్రినాధ రావు- రూ.1,57,978/-,
58 వార్డ్
డోక్లా ధనుశ్రీ C/O రామలక్ష్మి- రూ.30,000/-, 59 వార్డ్
పిళ్ళిచాతుర్య- రూ.20,000/-,
57వార్డ్
దండ్రురమేష్- రూ.52,660/-, 58 వార్డ్.
చెక్కులను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గణబాబు అందజేశారు. చెక్కులు అందుకున్న వారు మాట్లాడుతూ వైద్య సహాయం కోసం సీఎం చంద్రబాబు అందించిన నిధులు తమకు అందేలా కృషి చేసిన గణబాబుకి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జనసేన ఇంచార్జ్ అంగ దుర్గా ప్రశాంతి, 63 కార్పొరేటర్ గల్లా చిన్న, శిరం. ఉమా మహేశ్వరి, రామ్మోహన్ నాయుడు,పోతబత్తుల శ్రీను, 57వార్డ్ అధ్యక్షుడు పెంటకోట అజయ్, 57వార్డ్ కార్పొరేటర్ మురు వాణి మరియు
టీడీపీ జనసేన, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


