సత్కరించిన కూటమి నాయకులు
పున్నమి ప్రతినిధి, రామచంద్రపురం
రామచంద్రపురం మండలం సికె పల్లి పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ గా మండల విద్యాశాఖ అధికారి మార్కొండ నాయుడు ను ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ నియమించారు. ఏప్రిల్ రెండవ తేదీతో సర్పంచులు పదవీకాలం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్లను నియమించారు. బుధవారం స్పెషల్ ఆఫీసర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎంఈఓ మార్కొండ నాయుడిని, సచివాలయ సిబ్బంది, పంచాయతీ కూటమి నాయకులు సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయితీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, వేసవికాలం ప్రారంభం అవడంతో ముఖ్యంగా పంచాయతీ గ్రామాలలో త్రాగునీటిపై ప్రత్యేక దృష్టి సారించి నీటి సమస్య లేకుండా చేస్తానన్నారు. పంచాయతీలో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ పవన్, పంచాయతీ సెక్రటరీ శిరీష, కూటమి నాయకులు బి. కోటేశ్వర్ రెడ్డి,బి. రామకృష్ణారెడ్డి, ఎస్ ప్రభాకర్, కుప్పారెడ్డి, బాబయ్య, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు

