– సమావేశంలో ఒకరినొకరు గౌరవింపు వర్షం!
కామారెడ్డి,16 డిసెంబర్, ( పున్నమి ప్రతినిధి ) :
కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండల కేంద్రంలో స్థానిక సంస్థల సర్పంచ్-వార్డ్ మెంబర్ ఎన్నికల్లో విజయం సాధించిన నాయకులు ఒక్కతాటిపై ఒక్కటిగా మారారు! గెలిచిన సర్పంచులు, వార్డ్ మెంబర్లు కలిసి ఏర్పడిన సమూహంలో ఆప్యాయ తతో ఒకరినొకరు సన్మానం చేసుకున్నారు.ఈ అ సాధారణ కార్యక్రమం మండల కేంద్రంలో ఘనంగా జరిగింది.గ్రామీణ రాజకీయాల్లో ఐక్యతకు మరో ఉదాహరణ ఎన్నికల ఫలితాల తర్వాత ఉద్ధృతం గా ఏర్పడిన ఈ విజయ సమూహం, పరస్పర గౌరవంతో సన్మానాలు పురస్కరించుకున్నారు. సర్పంచులు తమ సహచరులను, వార్డ్ మెంబర్లు తమ నాయకులను ఆప్యాయతతో అభినందిం చారు.”ఇది మా మండల ఐక్యతకు చిహ్నం!” అంటూ పాల్గొన్న నాయకులు చెప్పారు.ఈ కార్యక్ర మం గ్రామ ప్రజల్లో తీవ్ర ఆదరణ పొందింది. రామా రెడ్డి మండలంలో ఈ సన్మాన సమ్మేళనం రాజకీయ ఐక్యతకు కొత్త ఆవిష్కరణలా మారింది. భవిష్య త్తులో ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువగా జరిగితే, గ్రామీణ అభివృద్ధి వేగంగా జరుగుతుందని స్థానికు లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


