సీనియర్ జర్నలిస్ట్ రమణ: సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐఖ్యత స్ఫూర్తితో అందరూ ముందుకు సాగాలని అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి పిలుపునిచ్చారు. పట్టణాలలోని ఎస్ కె బీ ఆర్ కాలేజీ నుండి గడియార స్తంభం సెంటర్ వరకూ జరిగిన రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో ఎంపీ హరీష్, కలెక్టర్, అధికారులు కూటమి నాయకులు, విద్యార్థులు భారీగా పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం గడియార స్తంభం వద్ద జరిగిన సమావేశంలో హరీష్ మాట్లాడుతూ వల్లభాయ్ పటేల్ పుట్టిన రోజున జాతీయ ఐక్యతా దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. దేశ ఐఖ్యతను ప్రపంచానికి చాటేందుకే ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని చేపట్టారని అదే ఐఖ్యతను చాటేందుకు రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చాటుతున్నారన్నారు. 500 కి పైగా సంస్థానాలను ఏకం చేసి దేశ ఐక్యతను నిలపడంతో పటేల్ ప్రత్యేక భూమిక పోషించారన్నారు. అదే స్ఫూర్తితో యువత, విద్యార్థులు తీసుకుని వారి గమ్య స్థానాలకు చేరుకోవాలన్నారు. ఇందుకోసమే కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎంపీ హరీష్ బాలయోగి అన్నారు.


