
మనందరం గొప్ప చదువులు చదువుకున్నప్పటికీ, ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు, ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేక మోసపోతున్నామని యువ రచయిత పిట్ట. గోపి ఆవేదన వ్యక్తం చేశారు.సమాజం నకిలీ మంటల్లో తగలబడుతుందని, నటన మాత్రం నాణ్యతగా దొరుకుతోందని ఆయన వ్యాఖ్యానించారు. యువతే దేశానికి వెన్నెముక అయినా, చాలామంది చదువుకు తోడైన ప్రతిభను కష్టపడి సంపాదించటానికి కాకుండా, ఇతరులను మోసం చేసి సులువుగా సంపాదించటానికి ఉపయోగిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు.”మూగజీవుల కంటే కూడా ఒక మనిషి ఇంకో మనిషిని డబ్బు కోసం సులభంగా చంపగలుగుతున్నాడు. డబ్బు కోసం ఎలాంటి పనైనా చేయడానికి వెనుకాడని పరిస్థితి వస్తోంది. ఇలాంటి దారిలో నడిచే వ్యక్తికి చివరికి జైలు జీవితం తప్ప విలాస జీవితం ఉండదు” అని గోపి గారు అన్నారు.డబ్బు, ఆకలి మంచివాడినీ చెడవాడిని చేయగలవని, ఎలాంటి పరిస్థితులలోనైనా నిబద్ధతతో జీవించాలనే విషయాన్ని గుర్తు చేశారు. “నేరాలు చేయటానికి ఉన్న ధైర్యం, కష్టపడి సంపాదించటానికి ఎందుకు ఉండడం లేదో ఆలోచించాలి” అని ఈ యువ రచయిత ప్రశ్నించారు.

