ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతినిధి)
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపుమేరకు బుధవారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో బిజెపి పట్టణ అధ్యక్షులు బానోతు విజయ్ అధ్యక్షతన పార్లమెంట్ కన్వీనర్ నంబూరు రామలింగేశ్వర రావు, జిల్లా అధికార ప్రతినిధి పడిగల మధు సుధన్ రావు లు ముఖ్య అతిధి లు గా హర్ గర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు
ఈ సందర్భముగా నంబూరి రామలింగే స్వరావ్, పడిగల మధు సుధన్ రావు లు మాట్లాడుతూ రాబోయే కాలంలో మన పిల్లలు ఒక ఆశయ సాధన కోసం క్రమశిక్షణ తో ఈ దేశ ఎదుగుదలలో భాగస్వాములు కావాలని, గొప్ప పౌరులుగా తీర్చిదిద్దాలని ప్రధాని నరేంద్ర మోదీ హర్ గర్ తిరంగా అనే కార్యక్రమానికి పిలుపునిచ్చారన్నారు
ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు కావాలని వారు కోరారు.
దేశభక్తితో విద్యార్థులు మరియు జాతీయవాదులు ఉత్సాహంగా ఈ ర్యాలీలో
పాల్గొన్నారు
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు, సత్తుపల్లి నియోజకవర్గ ఐదు మండలాల అధ్యక్షులు, రాష్ట్ర జిల్లా కౌన్సిల్ సభ్యులు, పట్టణ మండలాల నాయకులు, బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.


