ఖమ్మం ఫిబ్రవరి
(పున్నమి జిల్లా ఇంచార్జి)
సత్తుపల్లి మున్సిపాలిటీలో నూతన చైర్పర్సన్ మరియు వైస్ చైర్పర్సన్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించబడ్డాయి. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో సభ్యుల సమక్షంలో ఓటింగ్ ప్రక్రియ చేపట్టారు.
చైర్‌పర్సన్‌గా 22వ వార్డు కౌన్సిలర్ ఎండి రెహనా బేగం (కాంగ్రెస్ పార్టీ)ను ఎన్నుకున్నారు. ఈ ప్రతిపాదనను 4వ వార్డు కౌన్సిలర్ షేక్ మౌలాలి ప్రతిపాదించగా, 21వ వార్డు కౌన్సిలర్ మందపాటి ప్రభాకర్ రెడ్డి బలపరిచారు. అనంతరం జరిగిన ఓటింగ్‌లో ఆమెకు మెజారిటీ మద్దతు లభించడంతో చైర్‌పర్సన్‌గా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు.
వైస్ చైర్‌పర్సన్‌గా 3వ వార్డు కౌన్సిలర్ బొంతు సుమలతను ఎన్నుకున్నారు. ఈ ప్రతిపాదనను 1వ వార్డు కౌన్సిలర్ మట్టా ప్రసాద్ ప్రతిపాదించగా, 8వ వార్డు కౌన్సిలర్ బండారు శరత్చంద్ర బలపరిచారు. ఓటింగ్ అనంతరం ఆమెను వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనట్లు ప్రకటించారు.
ఈ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆరుగురు సభ్యులు పాల్గొనలేదు. అయితే, మిగిలిన సభ్యుల సమక్షంలో ఎన్నికలు సజావుగా పూర్తయ్యాయి.
నూతనంగా ఎన్నికైన చైర్పర్సన్ ఎండి రెహనా బేగం మరియు వైస్ చైర్పర్సన్ బొంతు సుమలతకు స్థానిక శాసన సభ్యురాలు శ్రీమతి మట్ట రాగమయి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మట్ట దయానంద్ లతో పాటు గా సభ్యులు, పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు.



