ఖమ్మం
పున్నమి ప్రతి నిధి
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఈనెల 18న బీసీ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన బంద్ కార్యక్రమానికి బీజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. బంద్ కార్యక్రమం శాంతియుతంగా కొనసాగుతుండగా, తట్టుకోలేని కాంగ్రెస్ మూకలు బీజేపీ కార్యకర్తలపై దాడి చేసి, అన్యాయంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. పోలీస్ శాఖ ఏకపక్షంగా వ్యవహరించి న్యాయం పట్ల విరుద్ధంగా వ్యవహరించిందని బీజేపీ నాయకులు ఆరోపించారు.
ఈ ఘటనపై జాతీయ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ, తమిళనాడు-కర్ణాటక రాష్ట్రాల ఇంచార్జ్ డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు రాష్ట్ర బీజేపీ కోశాధికారి దేవకి వాసుదేవరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఈవి రమేష్, జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి నాయుడు రాఘవరావు తదితరులతో కలిసి రాష్ట్ర డీజీపీ శ్రీ శివధర్ రెడ్డి గారిని కలిసి పూర్తి వివరాలను తెలియజేశారు.
ఈ సందర్భంగా పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలపై, అలాగే అన్యాయంగా కేసులు నమోదు చేసిన పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. బీజేపీ కార్యకర్తలపై జరుగుతున్న రాజకీయ దాడులను ఖండిస్తూ, ప్రజాస్వామ్యంలో విభిన్న అభిప్రాయాలను అణగదొక్కే ప్రయత్నాలు సహించబోమని హెచ్చరించారు.


