
గురువే దేశానికి వెన్నుముక అని, ప్రతి విద్యార్థి ఉపాధ్యాయుడిలా మారాలని గాయత్రి కళాశాలల డైరెక్టర్ లయన్ జి. సంయుక్త అన్నారు. స్థానిక ఇందిరా విజ్ఞాన్ భవనంలో సద్గుణ జీఈవో ఆర్గనైజేషన్, కెరీర్ ఫెయిర్ ఆధ్వర్యంలో గురుపూజోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా ప్రధాన అతిథిగా పాల్గొన్న సంయుక్త, డా. సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ – “గురువులే విద్యా వ్యవస్థకు మూలస్తంభాలు. విద్యార్థులు విలువలతో కూడిన విద్యను ఆచరిస్తేనే ఉన్నత స్థానాలు సాధించగలరు. ఇంటివద్ద ట్యూషన్ చెప్పే ఉపాధ్యాయులను సత్కరించడం వినూత్న ఆలోచన” అని అన్నారు.కార్యక్రమంలో డా. మంత్రి వెంకటస్వామి, కెరీర్ ఫెయిర్ సాయి బాబా, జై శ్రీరామ్, మణికుమారి, ప్రశాంత్, సీనియర్ అధ్యాపకులు నరేష్, పాలిశెట్టి మధుబాబు తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందజేసి, దుస్తులువాలతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో జీఈవో సభ్యులు, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు, విద్యార్థులు పాల్గొన్నారు.

