*నాగర్ కర్నూల్ జిల్లా. నవంబర్ 8
*సంపు గుంతలో పడి బాలుడి మృతి*
నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం పాలెం సుబ్బయ్య కాలనీలో విషాదం చోటుచేసుకుంది. ప్రాథమిక పాఠశాల ఆవరణం ముందు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణంలో భాగంగా తవ్విన సంపు గుంతలో పడి శశిధరన్ (3) మృతి చెందాడు. ఇటీవల వర్షాలకు నీరు నిండిన గుంతను కాంట్రాక్టర్ భాస్కర్ వదిలివేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. రెండేళ్ల క్రితం తండ్రిని కోల్పోయిన బాలుడి మృతితో తల్లి కన్నీరుమున్నీరైంది. బాధితులు పోలీసులను ఆశ్రయించారు.


