*శ్రీశ్రీశ్రీ తిరుపతి గంగమ్మ గుడి* *చైర్మన్ మురుగన్ ఉదారత*
👉ఓం శక్తి భక్తులకు ఉచిత తీర్థయాత్ర!
పలమనేరు,పున్నమి ప్రతినిధి
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో తనదైన ముద్ర వేస్తున్న పట్టణ పరిధిలోని గంటావూరు బీసీ కాలనీలో నెలకొన్న శ్రీశ్రీశ్రీ తిరుపతి గంగమ్మ ఆలయ చైర్మన్ మురుగన్ ఓం శక్తి మాల ధరించిన భక్తుల కోసం మూడు రోజుల పాటు పుణ్యక్షేత్రాల దర్శనానికి ఉచిత తీర్థయాత్రను ఏర్పాటు చేశారు.
*ఇందులో మూడు రోజులు.. నాలుగు మహా క్షేత్రాలు ఉన్నాయి.*
ఈ యాత్రలో భాగంగా భక్తులు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన
* తమిళనాడు నందలి శక్తి క్షేత్రమైన మేల్ మరువత్తూరు (అమ్మవారి ప్రధాన క్షేత్రం)
* కన్యాకుమారి
* చిదంబరం
* రామేశ్వరం పుణ్యక్షేత్రాలకు
ఉచితంగా
చైర్మన్ మురుగన్ భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లను చేసి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
*ఈ యాత్రలో పాల్గొనే భక్తులకు:*
* ఉచిత రవాణా: అత్యాధునిక బస్సు సౌకర్యం కల్పించబడుతుంది.
* భోజన వసతి: యాత్ర జరిగే మూడు రోజులూ మూడు పూటలా రుచికరమైన మరియు శుచికరమైన భోజన వసతి ఉచితంగా అందించబడుతుంది. ఈ సందర్బంగా చైర్మన్ మురుగన్ మాట్లాడుతూ…
“ఓం శక్తి అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలన్నదే మా సంకల్పం. మాల వేసి నియమనిష్టలతో ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, పుణ్యక్షేత్రాలను దర్శించుకునేలా ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాం. భక్తులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని అమ్మవారి కృపకు పాత్రులు కావాలి” అని మురుగన్ కోరారు.
ఈ యాత్రకు సంబంధించిన మరింత సమాచారం కోసం మరియు తమ పేర్లను నమోదు చేసుకోవడం కోసం గంటావూరు శ్రీశ్రీశ్రీ తిరుపతి గంగమ్మ ఆలయ కమిటీని సంప్రదించవలసిందిగా అయన తెలిపారు.


