Friday, 27 March 2026
  • Home  
  • శ్రీజ దమ్ముకు ఘన స్వాగతం బిగ్ బాస్‌లో శివంగిగా ప్రత్యేక గుర్తింపు తనకు ఓటు వేసిన వారందరికీ శ్రీజ కృతజ్ఞతలు
- విశాఖపట్నం

శ్రీజ దమ్ముకు ఘన స్వాగతం బిగ్ బాస్‌లో శివంగిగా ప్రత్యేక గుర్తింపు తనకు ఓటు వేసిన వారందరికీ శ్రీజ కృతజ్ఞతలు

విశాఖ ఎన్ఏడి , అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) నగరానికి చెందిన దమ్ము శ్రీజకు సోమవారం విశాఖ విమానాశ్రయంలో సాదర స్వాగతం లభించింది. ఈ సందర్భంగా శ్రీజ తల్లిదండ్రులు దమ్ము శ్రీనివాసరావు–లావణ్య దంపతులు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో కలిసి ఘనంగా స్వాగతం పలికారు. విమానాశ్రయంలో శ్రీజను పూలదండలతో సత్కరించి, కేకు కత్తిరించి శుభాకాంక్షలు తెలిపారు. అగ్నిపరీక్ష కార్యక్రమం ద్వారా గుర్తింపు తెచ్చుకున్న శ్రీజ, బిగ్ బాస్ హౌస్ లో కామనర్ కంటెస్టెంట్ గా ప్రవేశించి ఐదు వారాలపాటు అనేక టాస్కుల్లో ముందువరుసలో నిలిచి “శివంగి శ్రీజ”గా ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ప్రజల నుంచి విశేషమైన ఓట్లు పొందిన శ్రీజ, తనకు అభిమానంతో ఓటు వేసి ఆదరించిన వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇదే ప్రేమ, మద్దతు కొనసాగించాలని కోరారు. శ్రీజను స్వాగతించిన వారిలో సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, డాక్ యార్డ్ కేటీబీ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొని అభినందనలు తెలిపారు.

విశాఖ ఎన్ఏడి , అక్టోబర్ (పున్నమి ప్రతినిధి)

నగరానికి చెందిన దమ్ము శ్రీజకు సోమవారం విశాఖ విమానాశ్రయంలో సాదర స్వాగతం లభించింది.
ఈ సందర్భంగా శ్రీజ తల్లిదండ్రులు దమ్ము శ్రీనివాసరావు–లావణ్య దంపతులు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో కలిసి ఘనంగా స్వాగతం పలికారు.

విమానాశ్రయంలో శ్రీజను పూలదండలతో సత్కరించి, కేకు కత్తిరించి శుభాకాంక్షలు తెలిపారు.
అగ్నిపరీక్ష కార్యక్రమం ద్వారా గుర్తింపు తెచ్చుకున్న శ్రీజ, బిగ్ బాస్ హౌస్ లో కామనర్ కంటెస్టెంట్ గా ప్రవేశించి ఐదు వారాలపాటు అనేక టాస్కుల్లో ముందువరుసలో నిలిచి “శివంగి శ్రీజ”గా ప్రత్యేక గుర్తింపు సంపాదించారు.

ప్రజల నుంచి విశేషమైన ఓట్లు పొందిన శ్రీజ, తనకు అభిమానంతో ఓటు వేసి ఆదరించిన వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
భవిష్యత్తులో కూడా ఇదే ప్రేమ, మద్దతు కొనసాగించాలని కోరారు.

శ్రీజను స్వాగతించిన వారిలో సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, డాక్ యార్డ్ కేటీబీ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొని అభినందనలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.