శ్రీకాళహస్తి, మార్చి 18 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలో గంజాయి రవాణాపై పోలీసులు కఠిన చర్యలు చేపడుతూ ఒక స్మగ్లర్‌ను అరెస్ట్ చేశారు. టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన తనిఖీలలో సుమారు 2 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. టూ టౌన్ సీఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఉన్నతాధికారుల పర్యవేక్షణలో గంజాయి రవాణా, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో బంగారమ్మ గుడి నుంచి కైలాసగిరి కాలనీకి వెళ్లే మార్గంలో తనిఖీలు నిర్వహించగా 64 ఏళ్ల పెరుమాలు వేణుగోపాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి సుమారు 2 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని, అనంతరం రిమాండ్‌కు తరలించారు. అతను ప్రస్తుతం శ్రీకాళహస్తిలో నివసిస్తున్నప్పటికీ, తమిళనాడు రాష్ట్రానికి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. గతంలో తిరుచానూరు పోలీస్ స్టేషన్లో గంజాయి కేసులో కూడా అతనిపై కేసు నమోదై జైలుకు వెళ్లి వచ్చినట్టు వెల్లడైంది. ఒడిశా నుంచి గంజాయి తెచ్చి తిరుపతి, శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ‘వజ్రపహార్’ కార్యక్రమం కింద గ్రామాల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తూ ఈ కేసును ఛేదించామని పేర్కొన్నారు. గంజాయి వల్ల యువత దారి తప్పుతోందని, దొంగతనాలు, గొడవలు పెరుగుతున్నాయని పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరైనా గంజాయి రవాణా లేదా వినియోగంపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని, సమాచారదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని సీఐ ప్రజలను కోరారు.

శ్రీకాళహస్తిలో గంజాయి స్మగ్లర్ అరెస్ట్ – 2 కేజీల మాదకద్రవ్యాలు స్వాధీనం