Thursday, 26 March 2026
  • Home  
  • శ్రీకాళహస్తికి విద్యుత్ డివిజన్ దిశగా వేగం…సమస్యల శాశ్వత పరిష్కారానికి ఎమ్మెల్యే చర్యలు
- తిరుపతి

శ్రీకాళహస్తికి విద్యుత్ డివిజన్ దిశగా వేగం…సమస్యల శాశ్వత పరిష్కారానికి ఎమ్మెల్యే చర్యలు

శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజల చిరకాల కోరికైన ఏపీ ఎస్పీడీసీఎల్ డివిజన్ ఏర్పాటు దిశగా కీలక ముందడుగులు పడుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఈ అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని, విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో గురువారం తిరుపతిలోని ‘విద్యుత్ సౌధ’లో సంస్థ సీఎండీ శివశంకర్ లోతేటితో ఎమ్మెల్యే భేటీ అయ్యి సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ సమావేశం జరిగినట్లు తెలిసింది. గతంలోనే నియోజకవర్గంలో విద్యుత్ సరఫరాలో లోపాలు, సాంకేతిక సమస్యల వల్ల ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సీఎం దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే, తాజాగా వాటి పరిష్కారంపై దృష్టి సారించారు. శ్రీకాళహస్తిని ప్రధాన కేంద్రంగా తీసుకుని వెంకటగిరిని కలుపుతూ ప్రత్యేక విద్యుత్ డివిజన్ కార్యాలయం ఏర్పాటు చేయాలని సీఎండీకి ఎమ్మెల్యే ప్రతిపాదించారు. దీనివల్ల విద్యుత్ సమస్యల పరిష్కారం వేగవంతమవుతుందని ఆయన వివరించారు. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ వ్యవస్థ ఆధునీకరణ జరగకపోవడంతో లో వోల్టేజ్ సమస్యలు, తరచూ విద్యుత్ కోతలు ప్రజలను ఇబ్బందులకు గురిచేశాయని పేర్కొన్నారు. ముఖ్యంగా వ్యవసాయ, పారిశ్రామిక రంగాలపై దీని ప్రభావం ఎక్కువగా పడినట్లు తెలిపారు. శ్రీకాళహస్తి ఆధ్యాత్మిక క్షేత్రంగా మాత్రమే కాకుండా పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, ఇక్కడ విద్యుత్ డిమాండ్ పెరుగుతోందని ఎమ్మెల్యే చెప్పారు. ప్రత్యేక డివిజన్ ఏర్పాటుతో మరమ్మతులు వేగంగా జరిగి, నిర్ణయాలు త్వరగా తీసుకునే వీలుంటుందని వివరించారు. వెంకటగిరితో సమన్వయం చేస్తూ శ్రీకాళహస్తిని భవిష్యత్తులో విద్యుత్ హబ్‌గా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.