*శ్రీకాళహస్తీశ్వరాలయ అధికారుల తీరు మారలేదు అని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి , శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు ఆన్నారు . ఆలయం సమీపంలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన స్టేట్లను వారు పరిశీలించారు.*
ఆలయ ఒకటవ, రెండవ , మూడవ గేట్లు నుండి ఆలయంలోకి ప్రవేశించిన భక్తులు నాలుగో గేట్ నుండి బయటకు వస్తే చెప్పులు లేకుండా ఎండలో తారు రోడ్డు మీద కాళ్ళు కాలుతూ తట్టుకోలేక పరిగెడుతున్నారని వాట్సాప్ పత్రికల్లో వచ్చిన కథనాలకు స్పందించారు మంచిదే
కానీ కాంట్రాక్టర్లకు కొమ్ము కాసే విధంగా దానికోసం మొదట కార్పెట్ ఏర్పాటు చేశారు. రోడ్డుపైన కూల్ పెయింట్ వేశారు. మళ్లీ కొబ్బరి మట్టలతో పందిళ్ళు ఏర్పాటు చేశారు. చివరగా రేకుల షెడ్లను ఏర్పాటు చేశారు.
ఆలయ నిధులు ఈ విధంగా దుర్వినియోగం చేయడం సరైన పద్ధతి కాదు.
ఎట్టకేలకు రేకుల షెడ్డు ఏర్పాటు చేయడం మంచిదే.
అయితే భక్తుల కోసం ఏర్పాటు చేసిన షెడ్ లలో కార్లు ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేసి . వెళ్ళిపోతున్నారు.
లక్షలాది రూపాయలు కార్ పార్కింగ్ ద్వారా వసూలు చేస్తున్న కాంట్రాక్టర్లు దీనిపైన సరైన సూచనలు చేయకపోవడం. ఆలయ అధికారులు దీనిపైన సమగ్రమైన బోర్డులు ఏర్పాటు చేయకపోవడం తో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.
ఈ షెడ్ల వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాటు చేసిన విధంగా మారిపోయాయి. లక్షల రూపాయలు ఖర్చుపెట్టి భక్తుల సౌకర్యం కోసం ఏర్పాటు చేసినా భక్తులకు వేతనం తప్పడం లేదు. నీడలో ఏమో వాహనాలు మళ్లీ ఎండలో భక్తులు అనే పరిస్థితి ఏర్పడింది. అధికారుల మొద్దు నిద్ర వీడి ఏసీ గదుల నుండి బయటకు వచ్చి భక్తులు వేతలను గమనించి భక్తుల కోసం ఏర్పాటు చేసిన షెడ్లలో వాహనాలు పార్కింగ్ చేయకుండా చేయాలి.


