పున్నమి ప్రతినిధి కామారెడ్డి -05-01-2026
*శ్రీ సరస్వతీ శిశుమందిర్ కామారెడ్డిలో ఘనంగా పూర్వ విద్యార్థుల – ఆచార్యుల మహా సమ్మేళనం*
కామారెడ్డి జిల్లాలో స్థానిక శ్రీ సరస్వతీ శిశుమందిర్ హైస్కూలు ప్రాంగణంలో ఆదివారం నాడు కాకతీయ నగర్ శిశుమందిర్ హైస్కూలు మరియ భగత్ సింగ్ నగర్ పాఠశాలల్లో చదివిన 600 మంది పూర్వ విద్యార్థులతో, బోధించిన 200 మంది ఆచార్యులతో, పాఠశాల వివిధ కమిటీల 80సభ్యులతో శిశుమందిర్ అధ్యక్షులు డా,, శ్యామ్ సుందర్ అధ్యక్షతన, కమిటి ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థుల – ఆచార్యుల మహా సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది.
విద్యా పీఠం ఇందూర్ జిల్లా విభాగ్ కార్యదర్శి, పూర్వ విద్యార్థి పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ హరిస్మరణ్ రెడ్డి గారు మాట్లాడుతూ సనాతన హైంధవ ధర్మం గురించి, ఋషుల విద్యావిధానం గురించి, గురు శిష్యుల సత్సంబంధాల గురించి, వేదాల వైభవాన్ని, ఇలాంటి చదువు కేవలం శ్రీ సరస్వతీ శిశుమందిర్ లలోనే దొరుకుతుందని, ఇక్కడ చదివిన మీరంతా అదృష్టవంతులని, శిశుమందిరాలు ఇంకా ఉన్నాయి కాబట్టే ధర్మం, ఆచారాలు, సంస్కృతి, సాంప్రదాయాలు ఉన్నాయని సభనుద్దేశించి చెప్పారు.
శిశుమందిర్ హైస్కూలు అధ్యక్షులు డా,, శ్యామ్ సుందర్ గారు మాట్లాడుతూ కార్పోరేట్ కు దీటుగా పాఠశాలను నడుపుతూ, మన సంస్కృతి, సంప్రదాయాలను , ఆచార వ్యవహారాలను నేర్పుతూ, అందిస్తూ పాఠశాలలో నేడు దాదాపు 1500 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని, సంఖ్య పెరిగిన దృష్టా ఈ సంవత్సరం 260 అడ్మిషన్లు వాపసు పంపడం జరిగిందని తెలిపారు. ఈ బడిలో విద్యను అభ్యసించి విద్యార్థులు ఉన్నాతమైన స్థాయిలో అన్ని రంగాలలో ఉన్నారని తెలుపుతూ ఈ విద్యామందిర్ ఉన్నతికి కారకులైన వారందరికీ ఈ సభా ముఖంగా కృతజ్ఞతలు తెలిపారు.
శ్రీ పతకమూరి శ్రీనివాస్ తెలంగాణ సంఘటనా మంత్రి గారు మాట్లాడుతూ నేటి సమాజంలో దిగజారిపోతున్న కుటుంబ విలువలను, పద్ధతులను, నేటి యువత ఆచరించాల్సిన విధివిధానాలైన పంచ పరివర్తన గురించి తెలియజేశారు.
ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ తెలుగు విభాగాదిపతి ముఖ్యాతిథి
ఆచార్య కసిరెడ్డి వెంకట్ రెడ్డి గారు మాట్లాడుతూ తేనె ఎంత మధురంగా ఉంటుందో అలాంటి మధురమైన విద్యను, శ్రీ సరస్వతీ శిశుమందిర్లు అందిస్తున్నాయని విద్య యొక్క గొప్పదనంను, సమాజంలో ఏ దానం చేసినా అది శాశ్వతం కాదని, విద్యాదానమే మహోన్నతమైన గొప్పదని, క్రమశిక్షణకు మారు పేరు శిశుమందిరాలని తెలియజేశారు.
భగత్ సింగ్ నగర్ పాఠశాల అధ్యక్షులు శ్రీ ముప్పారపు ఆనంద్ గారు ప్రాథమిక పాఠశాల డెవలప్ మెంట్ గురించి మూతబడిపోతున్న పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచిన విధానం గురించి సహకరించన పెద్దల గురించి కొనియాడారు.
ఆసాంతం సాంస్కృతిక కార్యక్రమాలతో, సన్మానాలతో పూర్వ విద్యార్థుల-ఆచార్యుల మహా సమ్మేళనం విశేషవైభవంతో అత్యంత ఘనంగా జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో జిల్లా సంఘచాలక్ బొడ్డు శంకర్ గారు, గీరెడ్డి రాజారెడ్డి గారు, ప్రబంధ కారిని సభ్యులు, సంచలన సమితి సభ్యులు శ్రీ గోవర్ధన్ రెడ్డి గారు, శ్రీ రణజిత్ మోహన్ గారు, మాజీ కౌన్సిలర్ ఆకుల భరత్ గారు, ప్రధానాచార్యులు నాగ భూషణం, నగేష్ గార్లు, విద్వత్ సమితి సభ్యులు రాజేంద్ర, మాతాజీలు, పూర్వ ఆచార్యులు, పూర్వ విద్యార్థుల సమ్మేళనం కమిటి సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు


