Friday, 27 March 2026
  • Home  
  • శ్రీ శైలం మల్లన్న ని దర్శనం చేసుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ
- ఆంధ్రప్రదేశ్

శ్రీ శైలం మల్లన్న ని దర్శనం చేసుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ

పువ్వాడ నాగేంద్ర కుమార్ (పున్నమి ప్రత్యేక ప్రతి నిధ గురువారం శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దర్శనానంతరం… మధ్యాహ్నం 12.35 గంటలకు శ్రీ చత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రానికి చేరుకున్న భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు.* గౌరవ ప్రధానమంత్రి గారితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ కూడా శ్రీ చత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రానికి విచ్చేశారు. ముందుగా శ్రీ శివాజీ దర్బార్ హాల్ ను సందర్శించి… రాజ దర్బార్ ను, అలాగే అక్కడి గోడలపై శ్రీ చత్రపతి శివాజీ జీవిత చరిత్ర పై శిల్పాలతో అద్భుతంగా చిత్రీకరించిన చిత్రమాలికను ఆసక్తిగా తిలకించిన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు. ఈ సందర్భంగా అక్కడి శివాజీ విగ్రహానికి పుష్పాలను సమర్పించారు.* *అనంతరం ఆ పక్కనే ఉన్న శివాజీ ధ్యాన మందిరాన్ని కూడా సందర్శించారు. అక్కడ ధ్యానముద్రలో ఉన్న శ్రీ చత్రపతి శివాజీ, అమ్మవారి విగ్రహాలను తిలకించారు. అక్కడ కూడా అమ్మవారి విగ్రహానికి భక్తిశ్రద్ధలతో పుష్పాలను సమర్పించారు.* *శ్రీ చత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్ర నిర్వహణ బాగుందని ట్రస్ట్ నిర్వాహకులను అభినందించిన భారత ప్రధాని.* *ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, ఎస్పీ సుశీల్ షెరాన్, డోన్ ఆర్డిఓ నరసింహులు, చత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం ప్రెసిడెంట్ టి.జీ.వెంకటేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ పి.సుబ్బారెడ్డి, క్షేత్ర ప్రచారక్ ఎస్. భరత్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్. నాగేశ్వర రావు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

పువ్వాడ నాగేంద్ర కుమార్
(పున్నమి ప్రత్యేక ప్రతి నిధ

గురువారం శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దర్శనానంతరం… మధ్యాహ్నం 12.35 గంటలకు శ్రీ చత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రానికి చేరుకున్న భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు.*

గౌరవ ప్రధానమంత్రి గారితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ కూడా శ్రీ చత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రానికి విచ్చేశారు.

ముందుగా శ్రీ శివాజీ దర్బార్ హాల్ ను సందర్శించి… రాజ దర్బార్ ను, అలాగే అక్కడి గోడలపై శ్రీ చత్రపతి శివాజీ జీవిత చరిత్ర పై శిల్పాలతో అద్భుతంగా చిత్రీకరించిన చిత్రమాలికను ఆసక్తిగా తిలకించిన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు. ఈ సందర్భంగా అక్కడి శివాజీ విగ్రహానికి పుష్పాలను సమర్పించారు.*

*అనంతరం ఆ పక్కనే ఉన్న శివాజీ ధ్యాన మందిరాన్ని కూడా సందర్శించారు. అక్కడ ధ్యానముద్రలో ఉన్న శ్రీ చత్రపతి శివాజీ, అమ్మవారి విగ్రహాలను తిలకించారు. అక్కడ కూడా అమ్మవారి విగ్రహానికి భక్తిశ్రద్ధలతో పుష్పాలను సమర్పించారు.*

*శ్రీ చత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్ర నిర్వహణ బాగుందని ట్రస్ట్ నిర్వాహకులను అభినందించిన భారత ప్రధాని.*

*ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, ఎస్పీ సుశీల్ షెరాన్, డోన్ ఆర్డిఓ నరసింహులు, చత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం ప్రెసిడెంట్ టి.జీ.వెంకటేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ పి.సుబ్బారెడ్డి, క్షేత్ర ప్రచారక్ ఎస్. భరత్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్. నాగేశ్వర రావు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.