చేజర్ల సెప్టెంబరు (పున్నమి ప్రతినిధి)
చేజర్ల మండలం ఆదురుపల్లిలోని శ్రీ త్రికోటేశ్వర విద్యాలయంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని కేక్ కట్ చేసి ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ లక్ష్మీ నరసారెడ్డి డైరెక్టర్ సుధాకర్ రెడ్డి మరియు ప్రధానోపాధ్యాయులు కృష్ణ చైతన్య మాట్లాడుతూ విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తున్న గురువులందరికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పాఠశాలలో ఉత్తమ ఉపాధ్యాయునలుగా ఎంపికైన హిందీ ఉపాధ్యాయులు సుభాష్ మరియు ఆంగ్ల ఉపాధ్యాయులు చిన్ని లను ఘనంగా సన్మానించారు. విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు క్రీడా పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బాల బాలికలు ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


