Wednesday, 18 March 2026
  • Home  
  • శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా ముందస్తు ఉగాది, రంజాన్ పండుగల వేడుక
- తిరుపతి

శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా ముందస్తు ఉగాది, రంజాన్ పండుగల వేడుక

శ్రీకాళహస్తి, మార్చి 18 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలోని స్థానిక శ్రీరామ్ నగర్ కాలనీలోని శ్రీ చైతన్య పాఠశాలలో ముందస్తు ఉగాది, రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల సందర్భంగా విద్యార్థులు రంగురంగుల దుస్తులలో ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఎ. రూపాదేవి మాట్లాడుతూ.. ఉగాది, రంజాన్ యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేస్తూ, భిన్నత్వంలో ఏకత్వం అనే భావనను ప్రతిభంబించే భారతీయ సంస్కృతిలో ఉన్న ఐక్యతను తెలియజేశారు. అన్ని మతాలకు మధ్య పరస్పర గౌరవం, స్నేహభావం యొక్క ప్రాముఖ్యతను తెలిపారు. రెండు ముఖ్యమైన పండుగలను ఒకేరోజు జరపడం విశేషంగా నిలిచిందన్నారు. అనంతరం పాఠశాల ఎ.జి. యం సురేష్ మాట్లాడుతూ.. మతం కన్నా మానవత్వం ముఖ్యమని, ఉగాది కొత్త ఆశలను ఇస్తే, రంజాన్ మనసుకు శాంతిని ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జులు వాసంతి, కల్పన, ప్రీ ప్రైమరీ ఉపాధ్యాయులు, విద్యార్దులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.