శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 15: శివుని ఉద్దేశించి చేసే వ్రతాధికాలు రాత్రి సమయలలోచేయాలి. అదే ఆదేవదేవుని ప్రీతికరాన్ని కలిగిస్తుంది. మహాశివరాత్రికూడా నవరాత్రులతో సమానమే అని నిర్ణయ సింధువు ద్వారా తెలియవస్తుంది. అంటే దీక్షగా ఉపాసన చేయవలసి ఉంటుంది. ఆ ఉపాసనకు వీలుగా ఆయన మంత్రం ఉద్భవించిది. ఆ దే ఓం నమ:శివాయ. ప్రతి మాసంలో ప్రదోషవేళ కృష్ణ చతుర్దశి ఉంచే దానిని మాస శివరాత్రి అంటారు. మాఘ మా సంలో వచ్చే మాసశివరాత్రిని మహా శివరాత్రి అంటారు. ఇది మహాశివుడు అవిర్భవించిన దినం. ఈ మహాశివరాత్రి సం దర్భంలో శ్రీకాళహస్తీశ్వరాలయంలో హరహర మహాదేవ శంభోశంకర నామస్మరాలతో శ్రీకాళహస్తీశ్వరాలయం మారుమో గింది. శివయ్య దర్శనంతో భక్తులు పులకించిపోయారు. మహాశివరాత్రిని పురష్కరించుకుని ఆదివారం అశేష భక్తజనం శ్రీ స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయాధికారులు, ఇతర ప్రభుత్వ అధికారులు ప్రణాళికాబద్దంగా వ్యవహరించారు. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీకాళహస్తి కిటకిటలాడింది. ఆలయంలో ప్రత్యేక వూలు, విద్యుద్దీపాలతో అందంగా తీర్చిదిద్దారు. ఉత్సవ మూర్తులకు బంగారు ఆభరణాలు అలంకరించారు. ఆదివారం తెల్లవారుజామున రెండు గంటల నుంచే స్వామి, అమ్మవార్ల దర్శనం ప్రారంభమైనది. హరహర మహాదేవా శంభోశంకర నామస్మరణాలతో స్వామి, అమ్మవార్లను భక్తులు దర్శించుకున్నారు. రూ.500,200 టికెట్లతో పాటు సర్వదర్శనంకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. క్యూలై న్లలో భక్తులకు పాలు, బిస్కెట్లు, మంచినీరు సౌకర్యాలను అధికారులు భక్తులకు అందించారు. క్యూలైన్ల వ్యవస్థ పటిష్టంగా చేపట్టడంతో భక్తులు సాఫీగా దర్శనం చేసుకోగలిగారు. పాలక మండలి అద్యక్షులు కొట్టే సాయి ప్రసాద్, దేవస్తాన ఇఓ బాపిరెడ్డి, ఆలయాధికారులు, ట్రస్ట్ బోర్డు సబ్యులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లు పర్య వేక్షించారు.
ఇసుకేస్తే రాలని జనం :
మహాశివరాత్రిని పురష్కరించుకుని శ్రీకాళహస్తీశ్వరాలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం భక్తుల తాకిడి పెద్దగా లేకున్నా మద్యాహ్నం నుంచి ఇసుకేస్తే రాలనంత జనం తరలివచ్చారు. సుమారు లక్షమందికి పైగా భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నట్లు అంచనా.
ప్రణాళికబద్ధంగా ఏర్పాట్లు :
ఈసారి బ్రహ్మోత్సవాలకు ఆలయాధికారులు ప్రణాళికబద్దంగా ఏర్పాట్లను చేపట్టారు. మహాశివరాత్రి వర్వదినాన ఎటువంటి అవాంఛ నీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తపడ్డారు. ఆలయ కార్యనిర్వాహణ అధికారి టి.బాపిరెడ్డి విఐపిలకు, సామాన్యభ క్తులకు ఎటుంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు. పోలీస్ శాఖ వారు పటిష్ట మైన భద్రత చర్యలను చేపట్టారు. ఆదివారం దక్షిణామూర్తి వద్ద నుంచి అడ్డదారిలో భక్తులను పంపవద్దని ఇఓ ఆలయాధికారులను ఆదేశం చారు.
అందుబాటులో ప్రసాదాలు :
మహాశివరాత్రి సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తుల కోసం అధికారులు కావాల్సిన పులిహోరా, లడ్డు, వడ, జిలేబీ ప్రసాదాలను సి ద్దం చేశారు. ప్రత్యేకంగా ప్రసాదాల కౌంటర్లు ఏర్పాటు చేసి భక్తులకు ప్రసాదాలు అందుబాటులోకి తెచ్చారు. ఆలయం నుంచి ఉచిత ప్రసా దాన్ని భక్తులకు అందించారు. ఉచిత బస్సుల ద్వారా భక్తులు తరలింపు.
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తే అవకాశం ఉండటంతో ఆర్ టిసి అధికారులు పట్టణంలోని బస్సు ల రాకపోకలు నిలిపివేశారు. ఎపిసీడ్స్ కూడలి నుంచి బైపాస్ మీదుగా బస్సులు రాకపోకలు సాగాయి. అయితే ఏపిసీడ్స్ వద్ద బస్సులు దిగే భక్తుల కోసం ప్రయివేటు పాఠశాలలకు చెందిన బస్సులను ఏర్పాటు చేశారు. ఈ బస్సుల ద్వారా ఉదయం నుంచి సాయంత్రం వరకు బస్సుల ను ఉచితంగా తరలించారు. దీంతో భక్తులు సమస్యలు లేకుండా ముక్కంటి ఆలయానికి చేరుకోగలిగారు. మార్కెట్ కమిటీ ఆవరణంలో వాస నాలను, పార్కింగ్ చేయడంతో వాహనాల్లో వచ్చే భక్తులకు ఇబ్బందులు తప్పాయి.
నందిపై శివుని దివ్యతేజం :
మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం రాత్రి అధికార నంది వాహనంపై గంగాదేవి సమేతుడైన శివుడు సింహవాహనంపై జ్ఞానప్రసూనాంబ పురవీధుల్లో విహరించారు. శివరాత్రి పర్వదినాన జాగారం చేసే భక్తులను కటాక్షించేందుకు భక్తవత్సలుడైన సోమస్కందమూర్తి నందీశ్వరునిపై సింహవానం పై పార్వతిదేవని విహరించానున్నారు.

శివుని ఉపాసించడానికి తగినది మహాశివరాత్రి……
శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 15: శివుని ఉద్దేశించి చేసే వ్రతాధికాలు రాత్రి సమయలలోచేయాలి. అదే ఆదేవదేవుని ప్రీతికరాన్ని కలిగిస్తుంది. మహాశివరాత్రికూడా నవరాత్రులతో సమానమే అని నిర్ణయ సింధువు ద్వారా తెలియవస్తుంది. అంటే దీక్షగా ఉపాసన చేయవలసి ఉంటుంది. ఆ ఉపాసనకు వీలుగా ఆయన మంత్రం ఉద్భవించిది. ఆ దే ఓం నమ:శివాయ. ప్రతి మాసంలో ప్రదోషవేళ కృష్ణ చతుర్దశి ఉంచే దానిని మాస శివరాత్రి అంటారు. మాఘ మా సంలో వచ్చే మాసశివరాత్రిని మహా శివరాత్రి అంటారు. ఇది మహాశివుడు అవిర్భవించిన దినం. ఈ మహాశివరాత్రి సం దర్భంలో శ్రీకాళహస్తీశ్వరాలయంలో హరహర మహాదేవ శంభోశంకర నామస్మరాలతో శ్రీకాళహస్తీశ్వరాలయం మారుమో గింది. శివయ్య దర్శనంతో భక్తులు పులకించిపోయారు. మహాశివరాత్రిని పురష్కరించుకుని ఆదివారం అశేష భక్తజనం శ్రీ స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయాధికారులు, ఇతర ప్రభుత్వ అధికారులు ప్రణాళికాబద్దంగా వ్యవహరించారు. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీకాళహస్తి కిటకిటలాడింది. ఆలయంలో ప్రత్యేక వూలు, విద్యుద్దీపాలతో అందంగా తీర్చిదిద్దారు. ఉత్సవ మూర్తులకు బంగారు ఆభరణాలు అలంకరించారు. ఆదివారం తెల్లవారుజామున రెండు గంటల నుంచే స్వామి, అమ్మవార్ల దర్శనం ప్రారంభమైనది. హరహర మహాదేవా శంభోశంకర నామస్మరణాలతో స్వామి, అమ్మవార్లను భక్తులు దర్శించుకున్నారు. రూ.500,200 టికెట్లతో పాటు సర్వదర్శనంకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. క్యూలై న్లలో భక్తులకు పాలు, బిస్కెట్లు, మంచినీరు సౌకర్యాలను అధికారులు భక్తులకు అందించారు. క్యూలైన్ల వ్యవస్థ పటిష్టంగా చేపట్టడంతో భక్తులు సాఫీగా దర్శనం చేసుకోగలిగారు. పాలక మండలి అద్యక్షులు కొట్టే సాయి ప్రసాద్, దేవస్తాన ఇఓ బాపిరెడ్డి, ఆలయాధికారులు, ట్రస్ట్ బోర్డు సబ్యులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లు పర్య వేక్షించారు. ఇసుకేస్తే రాలని జనం : మహాశివరాత్రిని పురష్కరించుకుని శ్రీకాళహస్తీశ్వరాలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం భక్తుల తాకిడి పెద్దగా లేకున్నా మద్యాహ్నం నుంచి ఇసుకేస్తే రాలనంత జనం తరలివచ్చారు. సుమారు లక్షమందికి పైగా భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నట్లు అంచనా. ప్రణాళికబద్ధంగా ఏర్పాట్లు : ఈసారి బ్రహ్మోత్సవాలకు ఆలయాధికారులు ప్రణాళికబద్దంగా ఏర్పాట్లను చేపట్టారు. మహాశివరాత్రి వర్వదినాన ఎటువంటి అవాంఛ నీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తపడ్డారు. ఆలయ కార్యనిర్వాహణ అధికారి టి.బాపిరెడ్డి విఐపిలకు, సామాన్యభ క్తులకు ఎటుంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు. పోలీస్ శాఖ వారు పటిష్ట మైన భద్రత చర్యలను చేపట్టారు. ఆదివారం దక్షిణామూర్తి వద్ద నుంచి అడ్డదారిలో భక్తులను పంపవద్దని ఇఓ ఆలయాధికారులను ఆదేశం చారు. అందుబాటులో ప్రసాదాలు : మహాశివరాత్రి సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తుల కోసం అధికారులు కావాల్సిన పులిహోరా, లడ్డు, వడ, జిలేబీ ప్రసాదాలను సి ద్దం చేశారు. ప్రత్యేకంగా ప్రసాదాల కౌంటర్లు ఏర్పాటు చేసి భక్తులకు ప్రసాదాలు అందుబాటులోకి తెచ్చారు. ఆలయం నుంచి ఉచిత ప్రసా దాన్ని భక్తులకు అందించారు. ఉచిత బస్సుల ద్వారా భక్తులు తరలింపు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తే అవకాశం ఉండటంతో ఆర్ టిసి అధికారులు పట్టణంలోని బస్సు ల రాకపోకలు నిలిపివేశారు. ఎపిసీడ్స్ కూడలి నుంచి బైపాస్ మీదుగా బస్సులు రాకపోకలు సాగాయి. అయితే ఏపిసీడ్స్ వద్ద బస్సులు దిగే భక్తుల కోసం ప్రయివేటు పాఠశాలలకు చెందిన బస్సులను ఏర్పాటు చేశారు. ఈ బస్సుల ద్వారా ఉదయం నుంచి సాయంత్రం వరకు బస్సుల ను ఉచితంగా తరలించారు. దీంతో భక్తులు సమస్యలు లేకుండా ముక్కంటి ఆలయానికి చేరుకోగలిగారు. మార్కెట్ కమిటీ ఆవరణంలో వాస నాలను, పార్కింగ్ చేయడంతో వాహనాల్లో వచ్చే భక్తులకు ఇబ్బందులు తప్పాయి. నందిపై శివుని దివ్యతేజం : మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం రాత్రి అధికార నంది వాహనంపై గంగాదేవి సమేతుడైన శివుడు సింహవాహనంపై జ్ఞానప్రసూనాంబ పురవీధుల్లో విహరించారు. శివరాత్రి పర్వదినాన జాగారం చేసే భక్తులను కటాక్షించేందుకు భక్తవత్సలుడైన సోమస్కందమూర్తి నందీశ్వరునిపై సింహవానం పై పార్వతిదేవని విహరించానున్నారు.

