పెనుగొండ: సెప్టెంబర్ , (పున్నమి ప్రతినిధి)
పెనుగొండ వ్యవసాయ సహకార పరపతి సంఘం సభ్యుల భద్రతార్థం అమలు చేస్తున్న జనతా ఇన్సూరెన్స్ స్కీం ద్వారా సిరికి ధనలక్ష్మి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. ఆమె వ్యవసాయ రుణాన్ని సకాలంలో చెల్లించగా, దురదృష్టకరమైన ప్రమాదంలో మరణించటంతో, భర్త గోవిందరావుకు రూ.2,00,000/- విలువైన చెక్కు అందజేయబడింది. ఈ కార్యక్రమంలో త్రిసభ్య కమిటీ చైర్మన్ నక్కా వేదవ్యాసశాస్త్రి ప్రధాన అతిథిగా పాల్గొని చెక్కును అందజేశారు. సంఘం డైరెక్టర్లు వేండ్ర మురళి, కానూరి వెంకట సత్యనారాయణ, సీఈవో సుర్నీడి శ్రీరంగ సాయి పవన్ కుమార్ మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు. చైర్మన్ నక్కా వేదవ్యాసశాస్త్రి, ఇలాంటి ఇన్సూరెన్స్ పథకాలు రైతుల ఆర్థిక రక్షణకు ఉపయోగకరంగా ఉంటాయని, భవిష్యత్తులో సంక్షేమ పథకాలు మరింత తీసుకురానున్నారని తెలిపారు.


