*విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి*
*ఎండాడ వైఎస్సార్సీపీ కార్యాలయంలో వైయస్ఆర్సిపి యువజన విభాగం ఉత్తరాంధ్ర సమీక్ష సమావేశం నిర్వహించిన రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు పెందుర్తి మాజీ శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజ్ గారు.*
అదీప్ రాజ్ గారు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర లో యువజన విభాగం మరింత బలోపితం చేసి రానున్న రోజుల్లో గ్రామ ,మండలం యువజన విభాగం కమిటీలు త్వరత్వగతిన పూర్తి చేసి పార్టీ ఆదేశించిన ప్రతి కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు మెంటాడ స్వరూప్,జోనల్ ప్రెసిడెంట్ అంబటి శైలేష్,జిల్లా యువజన విభాగం అధ్యక్షులు మరియు కార్పొరేటర్ ఊరుకుటి చందు, రాష్ట్ర యువజన విభాగం అధికార ప్రతినిధి & కార్పొరేటర్ ఇమ్రాన్ పుల్లేటి వెంకటేష్, శరత్ బాబు,పృథ్వీ,అల్లు అవినాష్,గాబడి శేఖర్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలిశెట్టి సురేష్ రాజ్,దొడ్డి కిరణ్, జగుపిల్ల నరేష్ ,చందు యాదవ్,చింతకాయల వరుణ్,కనకాల ఈశ్వర్ రావు,సత్యం నాయుడు,శివాజీ చక్రవతి,వివిధ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు,రాష్ట్ర కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


