సిద్ధవటం,సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి)
మండలంలోని ఉప్పరపల్లి పంచాయతీ సాయి నగరులో శ్రీ భద్రావతి భావనారాయణ స్వామి ఆలయంలో శ్రీ విజయదుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు అమ్మవారిని ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. విగ్రహ దాత పుత్తా రామభద్రయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించబడ్డాయి. దసరా శరన్న నవరాత్రుల ఏడవ వార్షికోత్సవంలో పి.ఆర్.బి హ్యాండ్లూమ్ అధినేత పుత్తా రామభద్రయ్య కుమారులు పుత్తా బాబు, నాగభూషణం సంఘటనకు ఆధ్వర్యం వహించారు. ఆలయ అర్చకులు అమర్నాథ్ శర్మ, ఉత్సవాల్లో పాల్గొన్న భక్తుల కుటుంబ, వ్యాపార సమస్యలు తొలగిపోతాయని తెలిపారు. మహిళలు పెద్దఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.


