28-05-2020 మనుబోలు(పున్నమి ప్రతినిధి)
సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండలంలో మనుబోలు గ్రామం బీసీ కాలనీ, గమళ్లపాలెం, ఎస్సీ కాలనీలు , ఎస్ టి కాలనీలు లో దాదాపునాలుగు టన్నుల కూరగాయలు ను దాదాపు 1500 పేద కుటుంబాలకు వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిఆధ్వర్యంలో ఆయన సూచన మేరకు మనుబోలు మండల వైయస్ఆర్ సీపీ నాయకులు పేద ప్రజలకు అందజేశారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజల మధ్యే సమస్య ఉందని తెలిసిన వెంటనే స్పందిస్తారు సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు అనిఅన్నారు కరోన మహమ్మారి వచినప్పటి నుంచి నియోజకవర్గంలోనే తిరుగుతూ పేద ప్రజలకు అండగా వుంటూ సహాయసహకారాలుఅందిస్తున్నారు. మనుబోలు కరోనా పాజిటివ్ కేసు బయటపడటంతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో ప్రజల్లో మనోధైర్యం నింపి మనుబోలులో సోంతనిధులతో నిత్యవసరవస్తువులు పంపిణీ చేసారు.
మనుబోలు మండల కేంద్రంలో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో బి.సి.కాలనీ, గమళ్ల పాళెం ప్రాంతాలను రెడ్ జోన్ గా ప్రకటించిన నేపథ్యంలో ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా
కరోనా వ్యాధి పట్ల అవగాహనతో నివారణ చర్యలను తీసుకుంటూ, ధైర్యంగా ఉండండిఅని వ్యాధి వ్యాప్తి చెందకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ,పారిశుద్ధ్య నిర్వహణ లో ఎటువంటి లోపాలు లేకుండా అధికారులు ఆదేశించడం
ఈ ప్రాంతంలోని వారికి ఇబ్బందులు కలగకుండా
నిత్యావసర సరుకుల సరఫరాతో పాటు, తాగునీరు, విద్యుత్ సౌకర్యం లాంటి విషయాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక దృష్టి పెట్టి
ప్రజా అవసరాల కోసం 24 గంటలు సచివాలయ సిబ్బందిని అందుబాటులో ఉంచి ప్రజలకు అవసరమైన వైద్య సదుపాయాలు, మందులు, అవసరమైన ఇతర సరుకులను వాలంటీర్ల ద్వారా ఇళ్ల వద్దకే చేర్పిస్తున్నారు.
ప్రజలెవ్వరూ ఆందోళ చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకునేందుకు ప్రత్యేక అధికారిని కూడా నియమించా రు.రెడ్ జోన్ పరిధిలోని ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ, అవసరమైన వసతులు మౌలిక సదుపాయాల కల్పనను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు అని అన్నారు.రాబోయే రోజుల్లో ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతోకలిసికట్టుగా ముందుకు వెళ్తామన్నారు కరోనా విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రం మొత్తం ఇబ్బందులు పడుతున్నా సర్వేపల్లి నియోజకవర్గం లో మాత్రం పేద ప్రజలు ఇబ్బందులు పడకుండా చూసుకున్న వ్యక్తి మన అందరి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి చిట్టమూరు అజయ్ కుమార్ రెడ్డి , మండల కన్వీనర్ హరగోపాల్ రెడ్డి,కడివేటి చంద్రశేఖర్ రెడ్డి ,బీసీ సెల్అధ్యక్షులుదాసరిభాస్కర్ గౌడ్,చేరెడ్డిపట్టాభిరామిరెడ్డి,ముంగర విజయభాస్కర్ రెడ్డి ,దాసరి మహేంద్ర వర్మ ,చల్లా రవీంద్ర ,చలగల దయాకర్ ,సుధాకర్ రెడ్డి ,రమణయ్య తదితరులు పాల్గొన్నారు.
వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలకు కూరగాయల పంపిణీ
28-05-2020 మనుబోలు(పున్నమి ప్రతినిధి) సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండలంలో మనుబోలు గ్రామం బీసీ కాలనీ, గమళ్లపాలెం, ఎస్సీ కాలనీలు , ఎస్ టి కాలనీలు లో దాదాపునాలుగు టన్నుల కూరగాయలు ను దాదాపు 1500 పేద కుటుంబాలకు వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిఆధ్వర్యంలో ఆయన సూచన మేరకు మనుబోలు మండల వైయస్ఆర్ సీపీ నాయకులు పేద ప్రజలకు అందజేశారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజల మధ్యే సమస్య ఉందని తెలిసిన వెంటనే స్పందిస్తారు సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు అనిఅన్నారు కరోన మహమ్మారి వచినప్పటి నుంచి నియోజకవర్గంలోనే తిరుగుతూ పేద ప్రజలకు అండగా వుంటూ సహాయసహకారాలుఅందిస్తున్నారు. మనుబోలు కరోనా పాజిటివ్ కేసు బయటపడటంతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో ప్రజల్లో మనోధైర్యం నింపి మనుబోలులో సోంతనిధులతో నిత్యవసరవస్తువులు పంపిణీ చేసారు. మనుబోలు మండల కేంద్రంలో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో బి.సి.కాలనీ, గమళ్ల పాళెం ప్రాంతాలను రెడ్ జోన్ గా ప్రకటించిన నేపథ్యంలో ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా కరోనా వ్యాధి పట్ల అవగాహనతో నివారణ చర్యలను తీసుకుంటూ, ధైర్యంగా ఉండండిఅని వ్యాధి వ్యాప్తి చెందకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ,పారిశుద్ధ్య నిర్వహణ లో ఎటువంటి లోపాలు లేకుండా అధికారులు ఆదేశించడం ఈ ప్రాంతంలోని వారికి ఇబ్బందులు కలగకుండా నిత్యావసర సరుకుల సరఫరాతో పాటు, తాగునీరు, విద్యుత్ సౌకర్యం లాంటి విషయాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజా అవసరాల కోసం 24 గంటలు సచివాలయ సిబ్బందిని అందుబాటులో ఉంచి ప్రజలకు అవసరమైన వైద్య సదుపాయాలు, మందులు, అవసరమైన ఇతర సరుకులను వాలంటీర్ల ద్వారా ఇళ్ల వద్దకే చేర్పిస్తున్నారు. ప్రజలెవ్వరూ ఆందోళ చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకునేందుకు ప్రత్యేక అధికారిని కూడా నియమించా రు.రెడ్ జోన్ పరిధిలోని ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ, అవసరమైన వసతులు మౌలిక సదుపాయాల కల్పనను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు అని అన్నారు.రాబోయే రోజుల్లో ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతోకలిసికట్టుగా ముందుకు వెళ్తామన్నారు కరోనా విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రం మొత్తం ఇబ్బందులు పడుతున్నా సర్వేపల్లి నియోజకవర్గం లో మాత్రం పేద ప్రజలు ఇబ్బందులు పడకుండా చూసుకున్న వ్యక్తి మన అందరి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి చిట్టమూరు అజయ్ కుమార్ రెడ్డి , మండల కన్వీనర్ హరగోపాల్ రెడ్డి,కడివేటి చంద్రశేఖర్ రెడ్డి ,బీసీ సెల్అధ్యక్షులుదాసరిభాస్కర్ గౌడ్,చేరెడ్డిపట్టాభిరామిరెడ్డి,ముంగర విజయభాస్కర్ రెడ్డి ,దాసరి మహేంద్ర వర్మ ,చల్లా రవీంద్ర ,చలగల దయాకర్ ,సుధాకర్ రెడ్డి ,రమణయ్య తదితరులు పాల్గొన్నారు.