పెనగలూరు సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి)
పెనగలూరు మండలం గట్టు వారిపల్లి గ్రామంలో బొజ్జి రెడ్డి రాజశేఖర్ రెడ్డి కుమారుడు వేణుగోపాల్ రెడ్డి గారి పెద్దకర్మ కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి రైల్వే కోడూరు నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి తనయుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి హాజరయ్యారు. ఆయన వేణుగోపాల్ రెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు


