ఖమ్మం మార్చి
(పున్నమి జిల్లా ఇంచార్జి )
ఖమ్మం: వెలుగుమట్ల భూదాన్ భూముల్లో నివాసం కోల్పోయిన బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చిన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ కమిటీ అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావ్ మాట ప్రకారం, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశాలతో పువ్వాడ ఫౌండేషన్ మరియు భారత్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో బాధితులకు భోజన వసతి ఏర్పాటు చేశారు.
మంగళవారం జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాత మధుసూదన్ బాధితులకు స్వయంగా భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల ఇళ్లను కూల్చివేసి కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయంగా రోడ్డున పడేసిందని విమర్శించారు. అనంతరం మంత్రులు బాధితులను అపహాస్యం చేయడం మరింత బాధాకరమని అన్నారు.
బాధితులకు గూడు దొరికే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, వారికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, ఫ్లోర్ లీడర్ కర్నాటి కృష్ణ, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వ్యక్తిగత సహాయకులు రవికిరణ్, మాజీ సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, మహిళా నాయకురాలు కొల్లు పద్మ, ప్రచార కార్యదర్శి షకీనా, మాధవి నాయకులు బోజెండ్ల రామ్మోహన్, ఆరెంపుల వీరభద్రం, ఎర్రా అప్పారావు, వీరేందర్ గౌడ్, వెంకట్, ఉస్మాన్, నారుమల్ల వెంకన్న, తిరుమల్, సతీష్, ప్రాన్సిస్ తదితరులు పాల్గొన్నారు.



