ఖమ్మం ఫిబ్రవరి
(పున్నమి జిల్లా ఇంచార్జి )
ఖమ్మం నగర శివారు వెలుగుమట్ల బుధన్ ప్రాంతంలో ఇళ్లు కోల్పోయిన బాధితులను గురువారం కల్వకుంట్ల తారక రామారావ్ ఆధ్వర్యంలోని భారత రాష్ట్ర సమితి ప్రతినిధి బృందం పరామర్శించింది. ఇటీవల జరిగిన కూల్చివేతలతో నిరాశ్రయులైన కుటుంబాలను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, ఇల్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తక్షణమే నివాసం కల్పించాలని డిమాండ్ చేశారు. బాధితులకు శాశ్వత పరిష్కారం లభించే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. పేదల వద్ద ఉన్న నివాసాలను తొలగించి, వారికి ప్రత్యామ్నాయం చూపకుండా వదిలేయడం అమానుష చర్య అని విమర్శించారు.
మీకోసం సుప్రీం కోర్టుకు కూడా వెళ్లి కోట్లాడతాము
ఇదే స్థలంలో మా బి ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఇల్లు కట్టించి, గృహప్రవేశాలు చేసే బాధ్యత మాది
ఈ అక్రమ కూల్చివేతల గురించి శాసనసభ, శాసనమండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాము
ప్రస్తుత ప్రభుత్వం లేనివారి వద్ద నుండి తీసుకుని ఉన్నవారికి మేలు చేసే విధానాన్ని అనుసరిస్తోందని ఆరోపించారు. వెలుగుమట్ల బాధితులకు తక్షణ న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు తాత మధు, ఆర్వీఎస్ ప్రవీణ్ కుమార్, పువ్వాడ అజయ్, వద్ధి
రాజు రవిచంద్ర, సండ్ర వెంకట వీరయ్య, పగడాల నాగరాజు, ఆర్జెసి కృష్ణ, కూరాకుల నాగభూషణం, విజయ్ కుమార్ తదితర బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


