ప్రతినెల మూడవ శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే క్లస్టర్ సమావేశాల భాగంగా, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిట్వేల్ పరిధిలోని ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయుల సమావేశం నేడు జరిగింది. మండల విద్యాశాఖ అధికారి : 1 కోదండ నాయుడు, క్లస్టర్ ప్రధానోపాధ్యాయులు దుర్గరాజు ఆధ్వర్యంలో 19 పాఠశాలల ఉపాధ్యాయులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి కోదండ నాయుడు మాట్లాడుతూ, పరీక్షల్లో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేకమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఎస్ ఏ ఎం పి : 1 ( ఎఫ్ ఏ :1) పరీక్షలలో సి , డి గ్రేడ్ పొందిన విద్యార్థులు ఏ అంశాలలో వెనుకబడి ఉన్నారో తెలుసుకొని, వారిని పై గ్రేడ్‌కు తీసుకెళ్లేలా ప్రతి ఉపాధ్యాయుడు బాధ్యత వహించాలని ఆయన కోరారు. క్లస్టర్ ప్రధానోపాధ్యాయులు దుర్గరాజు మాట్లాడుతూ, సమావేశంలో చర్చించిన అంశాలను ప్రతి పాఠశాలలో కచ్చితంగా అమలు చేయాలని, విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని ఉపాధ్యాయులను పిలుపునిచ్చారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యారంగంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, ఆయన లక్ష్యాలు నెరవేర్చేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని తెలిపారు. సీనియర్ ఉపాధ్యాయులు కామాటం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఉపాధ్యాయులు సమయపాలన పాటించి ప్రతి విద్యార్థిపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు కోసం ఖర్చు చేస్తున్న నిధులు సద్వినియోగం అయ్యేలా చూడాలని అన్నారు. చివరిగా మండల విద్యాశాఖ అధికారులు, క్లస్టర్ ప్రధానోపాధ్యాయులు ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలలకు అకాడమిక్ క్యాలెండర్‌ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు భాస్కర్ రెడ్డి, సోఫియా, కామాటం వెంకటేశ్వర్లు, బాలసుబ్రమణ్యం, సతీష్, సి.ఆర్.ఎం.టి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి : క్లస్టర్ మీటింగ్