Thursday, 5 February 2026
  • Home  
  • *వృద్ధులకు కొండంత ఆదర్శంగా బీకేఆర్ వృద్ధాశ్రమం*
- E-పేపర్

*వృద్ధులకు కొండంత ఆదర్శంగా బీకేఆర్ వృద్ధాశ్రమం*

గన్నవరం, నియోజకవర్గం (పున్నమి ప్రతినిధి) సెప్టెంబర్ 25 కృష్ణా జిల్లా, గన్నవరం మండలం, గన్నవరం పట్టణంలో బస్టాండ్ సమీపంలో రీచ్ ప్రాంగణం నందు బీకేర్ వృద్ధాశ్రమం 3వ బ్రాంచ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు చిగురుపాటి కుమార స్వామి దంపతులు విచ్చేసి వృద్ధాశ్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కుమార స్వామి మాట్లాడుతూ వృద్ధులే కుటుంబ చారిత్రక ఆనవాళ్లు, వారి సంరక్షణ ఎంతో ముఖ్యం. గత 10 సంవత్సరాల నుండి వృద్ధుల సంరక్షణకు కట్టుబడి, వారికి బాసటగా నిలుస్తూ నేడు సకల హంగులతో, ఆహ్లాదకరమైన వాతావరణంలో బీ కే ఆర్ వృద్ధాశ్రమం 3 వ బ్రాంచ్ ను గన్నవరంలో ప్రారంభించడం ఎంతో ఆనందదాయకమని అన్నారు. వృద్ధాశ్రమంలో కార్యాలయాన్ని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మట్టా ప్రసాద్ ప్రారంభించి మాట్లాడుతూ వృద్ధుల సేవే పరమావధిగా అకుంఠిత దీక్షతో ఆశ్రమాన్ని 10 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న కానూరి శేషు మాధవి సేవలు ఆదర్శవంతమని అన్నారు. ఈ సందర్భంగా ఆశ్రమ చైర్మన్ కానూరి శేషు మాధవి మాట్లాడుతూ ఆశ్రమంలో వృద్ధులు ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉత్సాహంగా గడపడానికి సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని, ఎల్లపుడూ ఆరోగ్య సేవలు అందుబాటు లో ఉంచుతూ పరిశుభ్రమైన ఆహారం, నీరు, శుభ్రమైన వాతావరణంలో ఇతర సేవలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీ కే ఆర్ వృద్ధాశ్రమం కార్యదర్శి శ్రీ సత్య వేద కుమార్ (ఖన్నా) ,సమరసత సేవా సంస్థ అధ్యక్షుడు పాకాల త్రినాథ్, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాదిండ్ల మోహన్, నీటి సంఘాల అధ్యక్షుడు వెంకటేశ్వర రెడ్డి, బీజేపీ గన్నవరం మండల అధ్యక్షుడు నీలం అశోక్, పోలవరపు అనిల్, తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసిన అతిథులకు ఆహ్వానితులకు ఆశ్రమ వైస్ చైర్మన్ బొకినాల అశోక్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

గన్నవరం, నియోజకవర్గం (పున్నమి ప్రతినిధి) సెప్టెంబర్ 25
కృష్ణా జిల్లా, గన్నవరం మండలం, గన్నవరం పట్టణంలో బస్టాండ్ సమీపంలో రీచ్ ప్రాంగణం నందు బీకేర్ వృద్ధాశ్రమం 3వ బ్రాంచ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు చిగురుపాటి కుమార స్వామి దంపతులు విచ్చేసి వృద్ధాశ్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కుమార స్వామి మాట్లాడుతూ వృద్ధులే కుటుంబ చారిత్రక ఆనవాళ్లు, వారి సంరక్షణ ఎంతో ముఖ్యం. గత 10 సంవత్సరాల నుండి వృద్ధుల సంరక్షణకు కట్టుబడి, వారికి బాసటగా నిలుస్తూ నేడు సకల హంగులతో, ఆహ్లాదకరమైన వాతావరణంలో బీ కే ఆర్ వృద్ధాశ్రమం 3 వ బ్రాంచ్ ను గన్నవరంలో ప్రారంభించడం ఎంతో ఆనందదాయకమని అన్నారు. వృద్ధాశ్రమంలో కార్యాలయాన్ని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మట్టా ప్రసాద్ ప్రారంభించి మాట్లాడుతూ వృద్ధుల సేవే పరమావధిగా అకుంఠిత దీక్షతో ఆశ్రమాన్ని 10 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న కానూరి శేషు మాధవి సేవలు ఆదర్శవంతమని అన్నారు. ఈ సందర్భంగా ఆశ్రమ చైర్మన్ కానూరి శేషు మాధవి మాట్లాడుతూ ఆశ్రమంలో వృద్ధులు ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉత్సాహంగా గడపడానికి సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని, ఎల్లపుడూ ఆరోగ్య సేవలు అందుబాటు లో ఉంచుతూ పరిశుభ్రమైన ఆహారం, నీరు, శుభ్రమైన వాతావరణంలో ఇతర సేవలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీ కే ఆర్ వృద్ధాశ్రమం కార్యదర్శి శ్రీ సత్య వేద కుమార్ (ఖన్నా) ,సమరసత సేవా సంస్థ అధ్యక్షుడు పాకాల త్రినాథ్, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాదిండ్ల మోహన్, నీటి సంఘాల అధ్యక్షుడు వెంకటేశ్వర రెడ్డి, బీజేపీ గన్నవరం మండల అధ్యక్షుడు నీలం అశోక్, పోలవరపు అనిల్, తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసిన అతిథులకు ఆహ్వానితులకు ఆశ్రమ వైస్ చైర్మన్ బొకినాల అశోక్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.