వీధి కుక్కల కేసులో రాష్ట్రాల నిర్లక్ష్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం – నవంబర్ 3న ప్రధాన కార్యదర్శులు హాజరు కావాలని ఆదేశం.
వీధి కుక్కల సమస్యపై రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. అఫిడవిట్ దాఖలు చేయమంటే రాష్ట్ర ప్రభుత్వాలు నిద్రపోతున్నాయా అని తీవ్రంగా ప్రశ్నించింది. కోర్టు తీర్పును గౌరవించడం లేదని వ్యాఖ్యానిస్తూ అసహనం వ్యక్తం చేసింది. బెంగాల్, తెలంగాణ మినహా అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు నవంబర్ 3న వ్యక్తిగతంగా హాజరుకావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వీధి కుక్కల సమస్యపై తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేసింది.


