విశాఖ పర్యటన ఖరారు చేసుకున్న చంద్రబాబు
హైదరాబాద్: తెదేపా అధినేత చంద్రబాబు విశాఖ పర్యటనపై నెలకొన్న ఉత్కంఠ వీడింది. ఆయన విశాఖ వెళ్లేందుకు ఏపీ డీజీపీ నుంచి అనుమతి లభించింది. చంద్రబాబు రేపు ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి విశాఖకు బయలుదేరనున్నారు.
అక్కడ విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ప్రాంతాల్లో పర్యటించి, ఆర్.ఆర్.వెంకటాపురంలోని మృతుల కుటుంబాలను పరామర్శించనున్నారు. అనంతరం విశాఖలోని స్థానిక తెదేపా నేతలతో భేటీ కానున్నారు. సమావేశం ముగిసిన అనంతరం రోడ్డు మార్గాన అమరావతిలోని తన నివాసానికి బయలుదేరుతారు.