*విశాఖపట్నం డిసెంబర్ 11పున్నమి ప్రతినిధి*
విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, 32వ వార్డ్ కార్పొరేటర్ డాక్టర్ శ్రీ కందుల నాగరాజు గారిని మర్యాదపూర్వకంగా కలిసి, 34వ వార్డు జండా చెట్టు ప్రాంతంలోని హనుమంతుడు దేవస్థానం పెద్దలు తమ ప్రాంత దేవాలయ అభివృద్ధి అంశాలను వివరించారు.
రామాలయ అభివృద్ధి కోసం అవసరమైన విగ్రహాలను అందజేస్తానని డాక్టర్ కందుల నాగరాజు గారు హామీ ఇవ్వడం భక్తులకు ఆనందాన్ని కలిగించింది.
ఈ సందర్భంగా వేద పండితులు డాక్టర్ నాగరాజు గారిని ఆశీర్వదించి, ప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమం భక్తి, సేవ, సంప్రదాయాలకు నిదర్శనంగా ప్రత్యేకంగా నిలిచింది.


