మండల వ్యాప్తంగా జరగబోయే వినాయక చవితి పండుగను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని చిట్వెల్ ఎస్‌ఐ నవీన్ అన్నారు. ఈ సందర్భంగా స్థానిక పోలీస్‌స్టేషన్ పరిధిలోని గ్రామాల కమిటీ సభ్యులతో ఆయన సమావేశమయ్యారు.
ఎస్‌ఐ మాట్లాడుతూ పండుగ ఏర్పాట్లలో ప్రతీ కమిటీ ముందుగా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. విద్యుత్, నిమజ్జన ఏర్పాట్లు సమయానికి పూర్తయ్యేలా చూడాలని సూచించారు. వినాయక విగ్రహాల ప్రతిష్టాపనకు అనుమతులు తప్పనిసరి అని, ఊరేగింపులు శాంతియుతంగా జరిగేలా సహకరించాలని స్పష్టం చేశారు.
విద్యుత్ శాఖ అధికారులు, పంచాయతీ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించిన ఎస్‌ఐ, డీజేలు, రికార్డింగ్ డ్యాన్స్ లకు అనుమతి లేనని హెచ్చరించారు. పండుగను భక్తి, ఆనందాలతో జరుపుకోవడంతో పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కమిటీ సభ్యులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.


