Friday, 13 March 2026
  • Home  
  • విద్యార్థులకు రాత సామాగ్రి బహుకరించిన గురుమిత్ర ఫౌండేషన్
- తిరుపతి

విద్యార్థులకు రాత సామాగ్రి బహుకరించిన గురుమిత్ర ఫౌండేషన్

తొట్టంబేడు మండలంలోని గుండెలి గుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలు రాయడానికి అవసరమైన రాత సామాగ్రిని, తొమ్మిదవ తరగతి విద్యార్థులకు బ్రిడ్జ్ కోర్సులో భాగంగా వారికి గురుమిత్ర ఫౌండేషన్ వ్యవస్థాపకులు, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు చెంచయ్య స్టడీ మెటీరియల్ను అందజేశారు. ఈ సందర్బంగా ఉపాధ్యాయులు చెంచయ్య మాట్లాడుతూ….2013 వ సంవత్సరం నుండి గురుమిత్ర ఫౌండేషన్ ద్వారా నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహించడం మా బాధ్యతగా స్వీకరించామని సమాజంలో చదువు ఒక్కటే పేదరికాన్ని రూపుమాపుతుందని, అందుకోసం నిరంతరం కృషి చేయాల్సి ఉంటుందని, క్రమశిక్షణతో చదివి ఉన్నతమైన విలువలతో ఎదిగి తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరును, గుర్తింపును విద్యార్థులు తీసుకురావాలని ఆయన విద్యార్దులకు సూచించారు. గురుమిత్ర ఫౌండేషన్ బాధ్యతగా సామాజిక స్పృహతో విద్యార్థులకు పేద ప్రజలకు భవిష్యత్తు కోసం చెంచయ్య చేస్తున్న కృషిని పాఠశాల హెచ్.ఎం. విద్యార్థుల తల్లిదండ్రులు కొనియారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం ముని తిరుమలయ్య, ఉపాధ్యాయులు మూర్తి, రమాదేవి, భాస్కరయ్య మునీశ్వర్ రెడ్డి , శ్రీకర్ రెడ్డి ఢిల్లీ బాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.