ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మార్చి ( పున్నమి ప్రతినిధి)
సర్వేపల్లి నియోజకవర్గంలో విద్యార్థినుల కోసం సైకిళ్ల పంపిణీ కార్యక్రమం సందడిగా కొనసాగుతోంది. రెండో రోజు మనుబోలు జిల్లా పరిషత్ హైస్కూలులో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఏపీ ఆక్వా అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి కలిసి 8, 9 తరగతుల విద్యార్థినులకు 257 హీరో సైకిళ్లను అందజేశారు. SEIL కంపెనీ సీఎస్ఆర్ నిధులతో మొత్తం 1841 సైకిళ్లు అందించగా, యువగళం స్పూర్తితో 3132 సైకిళ్ల పంపిణీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సోమిరెడ్డి తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదువుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

విద్య కోసం ముందడుగు.. మనుబోలులో విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మార్చి ( పున్నమి ప్రతినిధి) సర్వేపల్లి నియోజకవర్గంలో విద్యార్థినుల కోసం సైకిళ్ల పంపిణీ కార్యక్రమం సందడిగా కొనసాగుతోంది. రెండో రోజు మనుబోలు జిల్లా పరిషత్ హైస్కూలులో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఏపీ ఆక్వా అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి కలిసి 8, 9 తరగతుల విద్యార్థినులకు 257 హీరో సైకిళ్లను అందజేశారు. SEIL కంపెనీ సీఎస్ఆర్ నిధులతో మొత్తం 1841 సైకిళ్లు అందించగా, యువగళం స్పూర్తితో 3132 సైకిళ్ల పంపిణీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సోమిరెడ్డి తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదువుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

