వింజమూరు, అక్టోబర్ 26 పున్నమి పత్రిక ప్రతినిధి
వింజమూరు లోని హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానం పోస్ట్ ఆఫీస్ వీధి ప్రసన్న రెడ్డి నగర్ పాతూరు వింజమూరు నందు, శివ కేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకొని అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని తనుశ్రీ రిఫ్రిజిరేషన్ విజయవాడ వాస్తవ్యులు అయినటువంటి వల్లెం వెంకటేశ్వర్ రెడ్డి వారి ధర్మపత్ని అఖిలారెడ్డి కుమార్తె తను శ్రీ రెడ్డి కుమారుడు నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి అత్యధిక అయ్యప్ప మాల ధరించిన స్వాములు, గోవింద స్వాములు, శివ స్వాములు, భవాని దీక్షపరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.ఈ కార్తీక మాసంలో అన్నదానం చేస్తే సకల ఫలాలు సిద్ధస్తాయని దేవస్థానం చైర్మన్ కరకర మాలకొండ రెడ్డి తెలియజేశారు. గురుస్వాములు అయినటువంటి చేబ్రోలు వసంతరావు,మస్తాన్ రెడ్డి ఆధ్వర్యంలో పూజాది కార్యక్రమాలు నిర్వహించారు.


