టీమిండియా ప్లేయర్స్ సంతకాలు చేసిన స్పెషల్ టీ షర్ట్ ను ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అందుకున్నారు. మహిళ క్రికెట్ పోటీలు తిలకించడానికి ఆదివారం విశాఖ వచ్చిన లోకేష్ ను ఆసియా కప్ టీమిండియా మేనేజర్ గా వ్యవహరించిన పి.వి ఆర్. ప్రశాంత్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఆసియా కప్ గెలుచుకున్నందుకు లోకేష్ అభినందనలు తెలియజేయగా.. కప్ గెలుచుకున్న ఆటగాళ్లు సంతకాలతో ఉన్న టీ షర్ట్ ను ప్రశాంత్ – లోకేష్ కు అందించారు. స్పెషల్ టీ షర్ట్ ను అందుకున్న తండ్రి లోకేష్ తో పాటు కుమారుడు దేవాన్ష్ ఎంతో మురిసిపోయారు. ప్రశాంత్ భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులు కుమారుడు కాగా, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అల్లుడన్న విషయం తెలిసిందే.

లోకేష్ కు టీమిండియా గిఫ్ట్