రోడ్డు ప్రమాద మృతుల కుటుంబానికి అండగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!ప్రమాదంలో తీవ్ర గాయాలైన మేఘన కి అత్యవసర చికిత్స అందించాలని కిమ్స్ వైద్యులకు ఎమ్మెల్యే ఆదేశం..!మృతి చెందిన వారికి ఇన్సూరెన్స్ క్లైమ్ కోసం, అన్ని ఏర్పాట్లు చేస్తున్న స్థానిక టిడిపి నాయకత్వం..
కలిగిరి అక్టోబర్ 16 :(పున్నమి ప్రతినిధి )://
ఉదయగిరి నియోజకవర్గం లోని కలిగిరి మండలం, దూబు గుంట గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన, చవలమూడి బాబు, మమత దంపతులు వారి కుమార్తెలు, వైభ, మేఘన, ద్విచక్ర వాహనంపై, కలిగిరికి ఆధార్ నమోదు నిమిత్తం వచ్చి తిరుగు ప్రయాణంలో దూబు గుంట కు వెళుతుండగా, మార్గమధ్యంలోని తెల్లపాడు క్రాస్ రోడ్డు వద్ద, బుధవారం సాయంత్రం బోర్ వెల్స్ లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చవలమూడీ బాబు, (34)మమత,(27)మరియు వారి కుమార్తె వైభ(8) ప్రమాద సంఘటనలోనే అక్కడికక్కడే మృతి చెందారు. మేఘన కు చేయి నుజ్జు నుజ్జు కావడం తోపాటు తీవ్ర గాయాల పాలయింది. ఈ ప్రమాద విషయాన్ని స్థానిక నాయకులు, పిచ్చ పాటీ చలపతి రెడ్డి ,హాజరత్ రెడ్డి శివరామయ్య,పవన్ కళ్యాణ్, మాలకొండా రెడ్డి, ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మండల నాయకులైన బిజ్జం వెంకటకృష్ణారెడ్డి, రావులకొల్లు వెంగపనాయుడు,కి, మృతుల కుటుంబానికి అండగా నిలవాలని ఎమ్మెల్యే ఆదేశాలు ఇచ్చారు. వెంటనే ఆత్మకూరులో చికిత్స పొందుతున్న మేఘన కు అత్యవసర చికిత్స అందించాలని నెల్లూరులోని కిమ్స్ వైద్యులకు ఎమ్మెల్యే ఫోన్ ద్వారా తెలియజేశారు. హుటాహుటిన ఆత్మకూరు నుండి మేఘనాను నెల్లూరుకు తరలించారు. కిమ్స్ వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. అదేవిధంగా మృతుల కుటుంబానికి బోర్ వెల్స్ లారీ ద్వారా ఇన్సూరెన్స్ క్లైమ్ చేసే నిమిత్తం, ఎఫ్ ఐ ఆర్ నమోదు, పోస్టుమార్టం రిపోర్టు తదితర, పనులను స్థానిక నాయకులు దగ్గరుండి చేస్తున్నారు. ఈ కేసు నిమిత్తం అడ్వకేట్ ను నియమించి ఇన్సూరెన్స్ క్లెమ్ పై పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా మృతుల కుటుంబానికి మట్టి ఖర్చుల నిమిత్తం 20వేల రూపాయలు కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా స్థానిక నాయకులు అందజేశారు. మృతుల కుటుంబాలకి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఇచ్చిన అండను, పలువురు ప్రశంసిస్తున్నారు.


