Friday, 3 April 2026
  • Home  
  • రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు
- జనగాం

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు

స్టేషన్ ఘన్పూర్ రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ఐకెపి సెంటర్ల లోనే ధాన్యం కొనుగోల్లు జరపాలని మార్కెట్ చైర్ పర్సన్ జూలుకుంట్ల లావణ్య శిరీష్ రెడ్డి అన్నారు. ఆదివారం ఘనపూర్ మండలంలోని ఇప్పగూడెం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలలోనే ధాన్యం అమ్ముకోవాలని, దళారుల వద్దకు వెళ్లి నష్ట పోవద్దని అన్నారు. మొదటి గ్రేడ్ రకం ధాన్యానికి రూ.2389, రెండవ గ్రేడ్ ధాన్యానికి రూ.2369 ల మద్దతు ధరను ప్రభుత్వం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సీజన్లో రైతులకు మద్దతు ధరతో పాటే ఒక క్వింటాలు రూ. 500 బోనస్ వారం రోజుల్లోనే జమ కానున్నాయని అన్నారు. రైతు పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నారు. దేశంలోనే ఎక్కడా లేని రైతు సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో VOA లు శ్రీలక్ష్మి, జయశ్రీ, కృష్ణ లీల, వివో అధ్యక్షులు మందపురం సునీత, పల్లె యాకలక్ష్మీ, వారాల సునీత, నాయిని రజిత, MD రుక్సానా, మహిళా సంఘాల సభ్యులు, ప్రజా ప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

స్టేషన్ ఘన్పూర్
రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ఐకెపి సెంటర్ల లోనే ధాన్యం కొనుగోల్లు జరపాలని మార్కెట్ చైర్ పర్సన్ జూలుకుంట్ల లావణ్య శిరీష్ రెడ్డి అన్నారు. ఆదివారం ఘనపూర్ మండలంలోని ఇప్పగూడెం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలలోనే ధాన్యం అమ్ముకోవాలని, దళారుల వద్దకు వెళ్లి నష్ట పోవద్దని అన్నారు. మొదటి గ్రేడ్ రకం ధాన్యానికి రూ.2389, రెండవ గ్రేడ్ ధాన్యానికి రూ.2369 ల మద్దతు ధరను ప్రభుత్వం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సీజన్లో రైతులకు మద్దతు ధరతో పాటే ఒక క్వింటాలు రూ. 500 బోనస్ వారం రోజుల్లోనే జమ కానున్నాయని అన్నారు. రైతు పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నారు. దేశంలోనే ఎక్కడా లేని రైతు సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో VOA లు శ్రీలక్ష్మి, జయశ్రీ, కృష్ణ లీల, వివో అధ్యక్షులు మందపురం సునీత, పల్లె యాకలక్ష్మీ, వారాల సునీత, నాయిని రజిత, MD రుక్సానా,
మహిళా సంఘాల సభ్యులు, ప్రజా ప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.