Tuesday, 31 March 2026
  • Home  
  • రైతు సమస్యలపై రాయచోటిలో వైఎస్సార్సీపీ ఆందోళన
- అన్నమయ్య

రైతు సమస్యలపై రాయచోటిలో వైఎస్సార్సీపీ ఆందోళన

అన్నదాత పోరు కార్యక్రమం భాగంగా భారీ ర్యాలీ రైల్వే కోడూరు, సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో అన్నదాత పోరు కార్యక్రమం ఉధృతమైంది. ఈ క్రమంలో మంగళవారం అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టర్ కార్యాలయం ఆవరణలో వైఎస్సార్సీపీ నేతలు, రైతులు కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు.రైతులకు యూరియా, విత్తనాలు అందుబాటులో లేకపోవడం, గిట్టుబాటు ధరలు నిర్లక్ష్యం చేయడం, కూటమి ప్రభుత్వం ఎటువంటి ఆర్థిక సాయం అందించకపోవడంపై నేతలు మండిపడ్డారు. బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతున్న యూరియాను అడ్డుకోవాలని, రైతులకు తక్షణమే అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు.కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఆర్ఓ లు అందుబాటులో లేకపోవడంతో ఎఒ నాగభూషణం కు వినతిపత్రం సమర్పించారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నియోజకవర్గ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, అన్నమయ్య జిల్లా పరిసలకులు, కడప మేయర్ సురేష్ బాబు, పీలేరు మాజీ ఎమ్మెల్యే రాంచంద్ర రెడ్డి, మదనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్, రాజంపేట ఇంచార్జి అకేపాటి అనిల్ కుమార్ రెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షులు, ఇతర నాయకులు పాల్గొన్నారు.“రైతు సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్సీపీ పోరాటం మరింత ఉధృతం అవుతుంది” అని నేతలు స్పష్టం చేశారు.

అన్నదాత పోరు కార్యక్రమం భాగంగా భారీ ర్యాలీ

రైల్వే కోడూరు, సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి)

రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో అన్నదాత పోరు కార్యక్రమం ఉధృతమైంది. ఈ క్రమంలో మంగళవారం అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టర్ కార్యాలయం ఆవరణలో వైఎస్సార్సీపీ నేతలు, రైతులు కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు.రైతులకు యూరియా, విత్తనాలు అందుబాటులో లేకపోవడం, గిట్టుబాటు ధరలు నిర్లక్ష్యం చేయడం, కూటమి ప్రభుత్వం ఎటువంటి ఆర్థిక సాయం అందించకపోవడంపై నేతలు మండిపడ్డారు. బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతున్న యూరియాను అడ్డుకోవాలని, రైతులకు తక్షణమే అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు.కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఆర్ఓ లు అందుబాటులో లేకపోవడంతో ఎఒ నాగభూషణం కు వినతిపత్రం సమర్పించారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నియోజకవర్గ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, అన్నమయ్య జిల్లా పరిసలకులు, కడప మేయర్ సురేష్ బాబు, పీలేరు మాజీ ఎమ్మెల్యే రాంచంద్ర రెడ్డి, మదనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్, రాజంపేట ఇంచార్జి అకేపాటి అనిల్ కుమార్ రెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షులు, ఇతర నాయకులు పాల్గొన్నారు.“రైతు సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్సీపీ పోరాటం మరింత ఉధృతం అవుతుంది” అని నేతలు స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.