ఎమ్ఎస్ ఎంఈ డైరెక్టర్ చినబాబు
పున్నమి ప్రతినిధి,రామచంద్రాపురం
ఆరుగాలం కష్టపడి అందరికీ ఆహారాన్ని పండించే రైతన్నల కళ్ళలో వెలుగు నింపటమే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు సూక్ష్మ చిన్న మధ్య తరగతి పరిశ్రమల డైరెక్టర్ నల్లపనేని మురళీమోహన్ (చినబాబు) అన్నారు. రామచంద్రాపురం మండలం,కమ్మపల్లి పంచాయతీలో బుధవారం రైతులు మరియు కార్యకర్తల అన్నదాత సుఖీభవకు సంభందించిన కర పత్రాలను ఆవిష్కరించి పంచిపెట్టారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతు ఖాతాలకు జమ చేసినటు వంటి అన్నదాత సుఖీభవ నిధులను గురించి చినబాబు
వివరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు యువ నాయకుడు నారా లోకేష్ రాష్ట్రమంతా పర్యటించి రైతన్నలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారని తెలిపారు.ఆ సందర్భంలో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే సంవత్సరానికి 20వేల రూపాయలు అన్నదాతల బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తున్నట్లు చెప్పారు.రాష్ట్ర ప్రభుత్వం గత పాలకులు సాగించిన అనాలోచిత పాలనతో ఆర్థికంగా చితికి పోయిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతన్నల సంక్షేమం కోసం అహర్నిశలు పనిచేస్తున్నారన్నారు.రైతులతో యాంత్రిక వ్యవసాయ పనిముట్లను విత్తనాలను ఎరువులను అందిస్తున్నారని గుర్తు చేశారు.రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అందిస్తున్న పథకాలు ఏ ఇతర రాష్ట్రంలోనూ లేవని తెలియజేశారు.పంటలకు అవసరమయ్యే ఎరువులను గ్రామాలలోని ఎక్కడకక్కడ కూటమి ప్రభుత్వం అందిస్తున్నదని వివరించారు.రైతుల భూములకు సంబంధించి ఎలాంటి తప్పిదాలకు చోటు లేకుండా రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలను పారదర్శకానికి మారుపేరుగా అందిస్తున్నదన్నారు.వ్యవసాయానికి న్యాయమైన కరెంటు అందించడంలో భాగంగా మండలంలో పలు కరెంటు సబ్ స్టేషన్లను మంజూరు చేసిందన్నారు.రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే పులివర్తి నాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,ఐటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ల దృష్టికి తీసుకొని వెళ్లి పరిష్కరిస్తున్నారని పేర్కొన్నారు.సమర్థత కలిగిన ఎమ్మెల్యే,దూర ఆలోచన కలిగిన ముఖ్యమంత్రి, ఆధునికతను అవలోహనము చేసుకున్న యువ నాయకుడు వున్న జట్టుతో రైతన్నలకు ఎల్లప్పుడు అన్ని విధాలుగా మంచిగలుగుతుందని తెలియజేశారు.దేశంలో ఎక్కడా లేనివిధంగా అగ్రిటెక్ ను యువతకు పరిచయం చేసి వ్యవసాయ ఎగుమతులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనున్నదని చెప్పారు.ఈ కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు.



