చోడవరం, అక్టోబర్ 28:
చోడవరంలోని MRO ఆఫీసు వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ చేపట్టిన రిలే నిరాహార దీక్ష రెండో రోజు కొనసాగుతోంది. వెంకన్నపాలెం–చోడవరం–మాడుగుల–రోలుగుంట–పాడేరు మార్గాల పునర్నిర్మాణం కోసం పార్టీ నేతలు ఆందోళన కొనసాగిస్తున్నారు.
గోతులుగా మారిన రోడ్లు చెరువుల్లా మారిపోయి, పాఠశాల బస్సులు, ఆర్టీసీ వాహనాలు, ఆటోలు, మోటార్ సైకిళ్లు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.
రోడ్లు పనులు పూర్తి అయ్యే వరకు క్వారీ లారీలు నడవకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేసింది. అలాగే విజయరామరాజుపేట బ్రిడ్జి మరమ్మతులు, వడ్డాది బ్రిడ్జి నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని, టెండర్లు పిలవాలని కోరింది.
ఈ నిరాహార దీక్షలో జిల్లా కన్వీనర్ కొణతాల హరినాథ్ బాబు, నియోజకవర్గ కన్వీనర్ వేగి మహాలక్ష్మి నాయుడు, కార్యకర్తలు కే. త్రినాథ్ రావు, కాంగ్రెస్ పార్టీ నేతలు పడాల కొండలరావు, రాము తదితరులు పాల్గొన్నారు.
శిబిరాన్ని పూలమాలలతో ప్రారంభించిన పసుమర్తి సతీష్ కు పార్టీ నేతలు ధన్యవాదాలు తెలిపారు.


