Monday, 8 December 2025
  • Home  
  • రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో భక్తులకు భద్రత కరువైందని పేర్కొన్న ఎమ్మెల్సీ ఇసాక్ బాష
- E-పేపర్

రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో భక్తులకు భద్రత కరువైందని పేర్కొన్న ఎమ్మెల్సీ ఇసాక్ బాష

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో భక్తులకు భద్రత కరువైందని నంద్యాల ఎమ్మెల్సీ ఇసాక్ బాష, వైసీపీ నేతలు పేర్కొన్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కి సలాటలో 10 మంది భక్తులు మృత్యువాతపడటం అనేక మంది గాయాలపాలవటంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యవైఖరి స్పష్టంగా కనిపిస్తున్నదని వైసీపీ నేతలు ఆరోపించారు. నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి ఆద్వర్యంలో నేడు నంద్యాల పట్టణం గాంధీ చౌక్ వద్ద వైసీపీ నేతలు ఎమ్మెల్సీ ఇసాక్ బాష, మున్సిపల్ చైర్ పర్సన్ మాబున్నీసా, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి ఇతర నాయకుల ఆధ్వర్యంలో కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాటలో మృతి చెందిన భక్తుల ఆత్మలకు శాంతి చేకూరాలని కొవొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇసాక్ బాష, మున్సిపల్ చైర్పర్సన్ మరియు వైపీపీ నేతలు మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వంలో భక్తులకు భద్రత కరువైందని, కాళీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని ఆలయ ధర్మకర్త పాండే స్థానిక పోలీసులకు ముందస్తు చర్యలు చేపట్టాలని చెప్పారని అయినా పోలీసులు భక్తులకు భద్రత కల్పించడంలో విఫలం చెందారని ఆరోపించారు. దేవాదాయ శాఖ మంత్రి కాళీ బుగ్గ వెంకటేశ్వర ఆలయం దేవాదాయశాఖ పరిదిలోకి రాదని చెప్పడం ఎంతో దారుణంగా ఉందని, ఇది ప్రభుత్వ నిర్లక్షధోరణికి నిదర్శనం అన్నారు. హోమంత్రి ఆలయానికి వచ్చే భక్తులకు భద్రత కల్పించలేక పోవడం ప్రభుత్వ వైఫల్యం అన్నారు. కూటమి ప్రభుత్వంలో భక్తుల ప్రాణాలకు విలువలేకుండా పోయిందని పేర్కొన్నారు. గతంలో జరిగిన పలు సంఘటనలు పునరావృతం కాకుండా భక్తులకు రక్షణ, భద్రత కల్పించాల్సిందిపోయి తప్పించుకొనే విధానంలో ఉండటం ఎంతో దారుణం అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా మేధావుల విభాగం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, రాష్ట్ర మహిళా విభాగం జనరల్ సెక్రెటరీ శశికళ రెడ్డి, జిల్లా కార్యదర్శి దేవనగర్ బాష, జిల్లా క్రిష్టియన్ మైనార్టీ అధ్యక్షుడు కారురవికుమార్, అసెంబ్లీ క్రిష్టియన్ మైనార్టీ అధ్యక్షుడు మనోజ్ కుమార్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు తిరుపతి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.