పలమనేరు నియోజకవర్గం, గంగవరం మండలానికి చెందిన గండ్రాజుపల్లె 8వ తరగతి విద్యార్థి ఎస్. యాసిర్ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక అయ్యారని ప్రధానోపాధ్యాయులు నాగరాజు తెలిపారు. జిల్లా స్థాయిలో గురువారం నిర్వహించిన సెపక్ టక్రా అనే అంతర్జాతీయ క్రీడా పోటీలకు అండర్-14 కేటగిరీ తరపున ఎంపికైనందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగరాజ, వ్యాయమ ఉపాధ్యాయులు రామకృష్ణ, ఉపాధ్యాయ బృందం విద్యార్థియాసిర్ కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
కాగా ఈ పోటీలు జిల్లాలోని ఎస్.ఆర్.పురం మండలం గంగమ్మగుడి జెడ్పీ హైస్కూల్ లో నిర్వహించారు. విద్యార్థి యాసిర్ కృషి, పట్టుదలతో విజయాన్ని సాధించడం పట్ల ఆ పాఠశాల కుటుంబం గర్వంగా భావిస్తోంది.
తదుపరి రాష్ట్ర స్థాయి సెపక్ టక్రా పోటీలు నవంబర్ 2, 3, మరియు 4 తేదీలలో అనంతపురంలో జరగనున్నాయి. యాసిర్ ఈ పోటీల్లో కూడా ప్రతిభ కనబరచాలని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు గ్రoడ్రాజుపల్లె విద్యార్థి యాసిర్
పలమనేరు నియోజకవర్గం, గంగవరం మండలానికి చెందిన గండ్రాజుపల్లె 8వ తరగతి విద్యార్థి ఎస్. యాసిర్ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక అయ్యారని ప్రధానోపాధ్యాయులు నాగరాజు తెలిపారు. జిల్లా స్థాయిలో గురువారం నిర్వహించిన సెపక్ టక్రా అనే అంతర్జాతీయ క్రీడా పోటీలకు అండర్-14 కేటగిరీ తరపున ఎంపికైనందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగరాజ, వ్యాయమ ఉపాధ్యాయులు రామకృష్ణ, ఉపాధ్యాయ బృందం విద్యార్థియాసిర్ కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. కాగా ఈ పోటీలు జిల్లాలోని ఎస్.ఆర్.పురం మండలం గంగమ్మగుడి జెడ్పీ హైస్కూల్ లో నిర్వహించారు. విద్యార్థి యాసిర్ కృషి, పట్టుదలతో విజయాన్ని సాధించడం పట్ల ఆ పాఠశాల కుటుంబం గర్వంగా భావిస్తోంది. తదుపరి రాష్ట్ర స్థాయి సెపక్ టక్రా పోటీలు నవంబర్ 2, 3, మరియు 4 తేదీలలో అనంతపురంలో జరగనున్నాయి. యాసిర్ ఈ పోటీల్లో కూడా ప్రతిభ కనబరచాలని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

