రాయచోటి వద్దు, రాజంపేట ముద్దు: 5 రోజుల దీక్షలో ఆటో యూనియన్
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పట్టణంలో ‘రాయచోటి వద్దు, రాజంపేట ముద్దు’ అనే నినాదంతో జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న 5 రోజుల రిలే నిరాహార దీక్షలో ఈరోజు ఆటో యూనియన్ అండ్ ఓనర్స్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీలకతీతంగా నాయకులు, ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వందలాది ఆటోలు ర్యాలీలో పాల్గొని తమ నినాదాలతో రైల్వే కోడూరు దద్దరిల్లేలా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రాజకీయ నాయకులు స్కూల్ కరస్పాండెంట్లు ప్రతి ఒక్కరూ పాల్గొనడం జరిగినది.


