– ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశాల మేరకు కార్యక్రమం
కామారెడ్డి, 19 నవంబర్, పున్నమి ప్రతినిధి :
ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే మదన్ మోహ న్ రావు ఆదేశాల మేరకు పార్టీలకు అతీతంగా,రామారెడ్డి మండల కేంద్రంలో బుధవారం సీఎంఆర్ఎఫ్ (ముఖ్యమంత్రి అనారోగ్య సహాయనిధి) చెక్కుల పంపిణీ కార్యక్ర మం ఘనంగా జరిగిందని తెలిపారు.ఈ కార్యక్ర మాన్ని రామారెడ్డి మండల అధ్యక్షులు మొగుళ్ళ ప్రవీణ్ గౌడ్ ఆధ్వర్యంలో రైతు వేదిక ప్రాంగణంలో నిర్వహించారు. మండలంలోని పలు గ్రామాల నుం డి ఎంపికైన లబ్ధిదారులకు మొత్తం 3 లక్షల రూపా యల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.లబ్ధిదారులు తమ అనారోగ్య పరిస్థితుల్లో ప్రభుత్వ సహాయం అందించినందుకు ఆనందం వ్యక్తం చేశా రు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి సహాయం అందజేస్తు న్న విధానం ప్రశంస నీయం అని వారు అభిప్రాయప డ్డారు.మండల అధ్యక్షులు మొగుళ్ళ ప్రవీణ్ గౌడ్ మాట్లాడుతూ, ప్రజల సమస్యలను గుర్తించి ప్రతి అర్హుడికి ప్రభుత్వం అందుబాటులో ఉన్న సహాయ నిధులు చేరేలా కృషి చేస్తున్నామన్నారు. సంక్షేమ పథకాల అమలులో ఎమ్మెల్యే మార్గదర్శకత్వం కీలకమని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ కార్యకర్తలు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


