కామారెడ్డి, 29 డిసెంబర్, ( పున్నమి ప్రతినిధి ) :
రామారెడ్డి మండల కేంద్రంలో ఆదివారం మున్నూ రు కాపు మండల సంఘం ఆధ్వర్యంలో నూతన సర్పంచ్ బండి ప్రవీణ్, ఉపసర్పంచ్ హనుమాయెల్ల నవీన్, పోసానిపెట్ ఉపసర్పంచ్ గండ్ర అంజయ్య మరియు వివిధ గ్రామాల వార్డు సభ్యులకు సన్మాన కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమం మండల మున్నూరు కాపు సంఘం ప్రధాన అధ్యక్షు డు కడెం శ్రీకాంత్ నేతృత్వంలో విజయవంతమైం ది. సర్పంచ్ బండి ప్రవీణ్, ఉపసర్పంచ్ నవీన్, పోసానిపెట్ ఉపసర్పంచ్ గండ్ర అంజయ్యలతో పాటు మండలంలోని వివిధ గ్రామాల వార్డు సభ్యు లకు శాలువాలు, జ్ఞాపికలు అందజేసి సన్మానం చేశారు. ముఖ్య అతిథిగా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబ ర్ తోట భూమన్న, జిల్లా సెక్రెటరీ అంజయ్య, కోశాధి కారి కుంట అంజన్న, మండల సెక్రెటరీ కాలా హను మాన్లు, కోశాధికారి డప్పు స్వామి, మండల కోఆర్డి నేటర్ బండి లింగం, గౌరవ అధ్యక్షుడు పైడాకుల కృష్ణలు పాల్గొన్నారు. పాల్గొన్నవారు మండల మున్నూరు కాపు సంఘం కమిటీ సభ్యులు రామా రెడ్డి మండల మున్నూరు కాపు కుల బాంధ వులు ఈ కార్యక్రమం మున్నూరు కాపు సంఘం ఆధ్వ ర్యంలో గ్రామపంచాయతీ నాయకుల విజయాన్ని జరుపుకుని, మండలాభివృద్ధికి కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చింది.


