రామచంద్రపురం మండలం పున్నమి ప్రతినిధి
రామచంద్రాపురం మండలం బలిజపల్లె గ్రామంలో ఆదివారం మన శివశంకర వరప్రసాద్ సినీ యూనిట్ సందడి చేశారు. తిరుపతిలో సినిమా ట్రైలర్ లంచ్ ప్రోగ్రాం సందర్భంగా తిరుపతికి విచ్చేసిన డైరెక్టర్ అనిల్ రావుపూడి, చిరంజీవి పెద్ద కుమార్తె, ప్రొడ్యూసర్ సౌందర్య ముందుగా చిరంజీవి వీరాభిమాని మండలంలోని బలిజపల్లి గ్రామానికి చెందిన ఈశ్వర్ కుటుంబాన్ని సందర్శించారు. గ్రామానికి విచ్చేసిన సినీ యూనిట్ కు గ్రామస్తులు అభిమానులు భారీగా ఘనస్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేశారు. వినిలో భాగంగా ముగ్గుల పోటీలు, గంగిరెద్దుల విన్యాసాలు, పిండి వంటలు తయారీ , కోలాటాలు, గొబ్బెమ్మలతో ఘనంగా ముందుగానే సంక్రాంతి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ
జనవరి 12న సంక్రాంతికి వస్తున్న చిత్రం మన శివశంకర వరప్రసాద్ చిత్రాన్ని విజయవంతం చేయాలని ప్రొడ్యూసర్ కొణిదల సుస్మిత తో కలిసి పిలుపునిచ్చారు.
మన పల్లె సంక్రాంతి ముందే వచ్చినట్లు అనిపించిందన్నారు
బలిజపల్లె గ్రామానికి ఒక ప్రత్యేకత అన్నారు
మోగాస్టార్ వీరాభిమాని ఈశ్వర్ గురించి కథలు కథలుగా విన్నానన్నారు. మన మెగాస్టార్ చిరంజీవి కోసం
తిరుమలకు పొర్లుదండాలతో, కరోనా సమయంలో సైకిల్ యాత్ర చేసినఈశ్వర్ ను కలవడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ మన సినిమాని ఆదరిస్తారని ఆశిస్తున్నాను అన్నారు.
Uploaded Video:



