Tuesday, 14 April 2026
  • Home  
  • రాజ్యాంగ నిర్మాత ఆశయాలను కొనసాగిద్దాం – డాక్టర్ చంద్రప్ప పిలుపు
- తిరుపతి

రాజ్యాంగ నిర్మాత ఆశయాలను కొనసాగిద్దాం – డాక్టర్ చంద్రప్ప పిలుపు

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 14 (పున్నమి న్యూస్) భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీరామ్ నగర్ 109వ పోలింగ్ బూత్ నందు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా బిజెపి మాజీ అధ్యక్షులు డాక్టర్ చంద్రప్ప ముఖ్య అతిథిగా పాల్గొని, అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ చంద్రప్ప మాట్లాడుతూ.. అణగారిన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన కృషి చిరస్మరణీయమని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకురాలు కండ్రిగ ఉమా, పోలింగ్ బూత్ సభ్యులు, స్థానిక నేతలు పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా వార్డులోని పిల్లలకు, పెద్దలకు స్వీట్లు పంపిణీ చేసి జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.