రాజంపేట, సెప్టెంబర్ 04: ఈ రోజు మధ్యాహ్నం రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయంలో కొత్తగా బాధ్యతలు స్వీకరించిన సబ్ కలెక్టర్ భావన మేడమ్‌ను మర్యాద పూర్వకంగా కలిసి గుంటకల్లు రైల్వే డీఆర్సీసీ సభ్యులు తల్లెం భరత్ కుమార్ రెడ్డి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓబులవారిపల్లె మండలం మంగంపేట సచివాలయం పరిధిలోని కాపుపల్లి, అగ్రహారం, హరిజనవాడ, అరుంధతివాడ గ్రామాలు సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండటంతో అక్కడి ప్రజలు రేషన్ బియ్యం కోసం ఇబ్బందులు పడుతున్నారని, అందువల్ల ఆయా గ్రామాలలోనే పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాకుండా మంగంపేట గ్రామం డేంజర్ జోన్ ఆర్ అండ్ ఆర్ ఫైవ్‌లో ఉండటంతో, అక్కడి ప్రజలకు రావలసిన కొత్త నష్టపరిహారాలు, పెండింగ్‌లో ఉన్న పరిహారాలను త్వరితగతిన పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గల్లా శ్రీనివాసులు, కౌలూరి రఘురాంరెడ్డి, కౌలూరి చిన్నికృష్ణారెడ్డి, మడగల రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

రాజంపేట సబ్ కలెక్టర్‌కు డీఆర్సీసీ సభ్యుడు తల్లెం భరత్ వినతి పత్రం